HomeMovie News Teluguనో ఎక్స్‌పోజింగ్‌ - మళ్లీ తేల్చేసిన కీర్తి సురేష్‌

నో ఎక్స్‌పోజింగ్‌ – మళ్లీ తేల్చేసిన కీర్తి సురేష్‌

హీరోయిన్‌ అన్నాక ఎక్స్‌పోజింగ్‌ చేయాలి. ఎంతగా అందాలారబోస్తే అంతగా అవకాశాలు క్యూ కడతాయి.. అనే మాట ఒకప్పటిది. కానీ ఇప్పుడు వస్తున్న ముద్దుగుమ్మల్లో కొంతమంది ఆలోచనలు మారాయి. ఎక్స్‌పోజింగ్‌ చేస్తేనే అవకాశాలు అనే మాటకి చెల్లు చీటీ ఇచ్చేసి, నో ఎక్స్‌పోజింగ్‌ ఓన్లీ టాలెంట్‌ అనే నియమాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ ఆటిట్యూడ్‌తో పలువురు ముద్దుగుమ్మలు సక్సెస్‌ అవుతున్నారు కూడా. వారిలో ముఖ్యంగా ముందు వరసలో ఉండే ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఈ బ్యూటీ అందానికే కాదు, అభినయంలోనూ దిట్ట. ‘నేను శైలజ’ సినిమాతో ఫ్రెష్‌గా ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమా నుండీ సక్సెస్‌లు అందుకుంటూ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్‌ చేసింది తెలుగు ప్రేక్షకుల్ని. తెలుగుతో పాటు, తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మ హవా చూపిస్తోంది. మంచి మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. అయితే అమ్మడు ఎక్స్‌పోజింగ్‌కి చాలా దూరం. మొదట్నుంచీ ఇదే చెప్పుకొస్తోంది. మళ్లీ తాజాగా ఆమె వద్ద ఎక్స్‌పోజింగ్‌ విషయం ప్రస్థావిస్తే, అస్సలు ఆ క్వశ్చనే తన వద్ద రావద్దనీ, నేనింతే, గ్లామరస్‌ పాత్రల్లో అస్సలు నటించను.

ఎక్స్‌పోజింగ్‌ అన్న మాటే నా దగ్గర తీసుకురావద్దు. ఎక్స్‌పోజింగ్‌ చేస్తేనే హీరోయిన్‌నా? ఎక్స్‌పోజింగ్‌ లేకపోతే అవకాశాలు రావా? అని తిరిగి ప్రశ్నలు వేస్తూ, ఒకవేళ అదే జరిగితే అవకాశాలైనా వదిలేసుకుంటాను కానీ, ఎక్స్‌పోజింగ్‌ జోలికి పోననీ ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది. అలాగే ఎక్స్‌పోజింగ్‌ లేకపోతే ఏంటి? నాకు అవకాశాలకు వచ్చిన లోటేముంది అంటోంది ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ప్రస్తుతం ఈ నేచురల్‌ బ్యూటీ పవన్‌ కళ్యాన్‌ సినిమాలోనూ, ‘మహానటి’ సినిమాలోనూ నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular