HomeMovie News Teluguఎవరీ రష్మిక!

ఎవరీ రష్మిక!

‘కిరిక్‌ పార్టీ’ అనే కన్నడ సినిమాలో నటించిన రష్మిక గురించి తెలుగు సినీ పరిశ్రమలో అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆమెకు వరుసగా ఆఫర్లు టాలీవుడ్‌లో వచ్చే అవకాశాలున్నాయి మరి. నాగశౌర్య నటించనున్న ఓ సినిమా కోసం రష్మికను అనుకుంటున్నారు. అయితే ఇంతలోనే ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ కాంబినేషన్‌లో రానున్న సినిమా కోసం రష్మికతో సంప్రదింపులు జరిగినట్లుగా వార్తలు వెలుగులోకి వచ్చాయి. ‘బాహుబలి’తో ప్రబాస్‌ రేంజ్‌ మారిపోయింది.

అలాంటి ప్రబాస్‌ పక్కన హీరోయిన్‌గా ఛాన్స్‌ అంటే విశేషమే మరి. ఈ రెండే కాకుండా మూడో ఆఫర్‌ కూడా తెలుగులో రష్మిక తలుపు తట్టిందట. అదే అల్లు అర్జున్‌ కొత్త సినిమా. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించే సినిమా కోసం రష్మికను హీరోయిన్‌గా తీసుకుంటే బావుంటుందని ఆలోచిస్తున్నారట. అసలీ రష్మిక ఎవరో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమే లేదు. కానీ ఆమెకొస్తున్న ఆఫర్స్‌ సంగతి చూస్తుంటే చర్చలు కాక మరింకేంటి చెప్పండి.

అయితే రష్మిక, ఇంతవరకు తెలుగు సినీ పరిశ్రమలో నటించడంపై అధికారికంగా స్పందించలేదు. కానీ రాత్రికి రాత్రి ఈ బ్యూటీ టాలీవుడ్‌లో సెన్సేషనన్‌ అయిపోవడం వింతే కదా. అమ్మడి టాలెంట్‌ ఏంటో చూడాలంటే వీటిలో ఏ ఒక్క సినిమా అయినా పట్టాలెక్కితే కానీ తెలీదు. చూద్దాం. ఎంట్రీకి ముందే ఇంత సెన్సేషన్‌ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న భామలకు ఎంత పోటీ ఇస్తుందో! 

You May Like This
- Advertisment -spot_img

Most Popular