HomeMovie News Teluguవెంకీ విత్‌ మెగాస్టార్‌: ఇది నిజమేనా?

వెంకీ విత్‌ మెగాస్టార్‌: ఇది నిజమేనా?

చిరంజీవి నటించనున్న ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ సినిమాకి అదనపు ఆకర్షణ తోడవనుంది. విక్టరీ వెంకటేష్‌ ఈ చిత్రంలో నటించాలని ఉవ్విళ్ళూరుతున్నాడట. చిరంజీవితో మంచి స్నేహం ఉందని చెబుతూ ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాలో నటించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నా కొన్ని కారణాలతో అది కుదరలేదని వెంకటేష్‌ ఇటీవల చెప్పాడు. సెట్స్‌లో షడెన్‌గా ప్రత్యక్షమై చిరంజీవికే షాకిద్దామనుకున్నాడట వెంకీ.

అంటే వెంకీ ఎలాగైనా చిరంజీవితో సినిమా చేద్దామనుకుంటున్నాడనే అర్థం చేసుకోవాలి. ఎలాంటి బేషజాలకూ పోకుండా స్టార్‌డమ్‌ని ఎంజాయ్‌ చేస్తూ ఇతర హీరోల సినిమాల్లో నటించడానికి ముందుకొస్తుంటాడు వెంకటేష్‌. మహేష్‌తో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసినా, ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్‌తో చేసినా ఆ రెండు సినిమాల్లోనూ ఇతర హీరోలతో ఆన్‌స్క్రీన్‌ రాపోని అద్భుతంగా మెయిన్‌టెయిన్‌ చేశాడు వెంకీ.

చిరంజీవితో అయితే ఇంకా ఎక్కువ ర్యాపో ఉన్న వెంకీ, దాన్ని స్క్రీన్‌పై ఇంకా అద్భుతంగా చూపించే అవకాశం ఉంది. ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ అత్యంత ప్రతిష్టాత్మకమైనది కావడంతో, అందులో వెంకీ జాయిన్‌ అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఇది బిగ్గెస్ట్‌ మల్టీస్టారర్‌ అవుతుంది. సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రామ్‌చరణ్‌ నిర్మాత.

You May Like This
- Advertisment -spot_img

Most Popular