HomeMovie News Teluguపవన్‌ కళ్యాణ్‌ ఏంటా స్పీడు?

పవన్‌ కళ్యాణ్‌ ఏంటా స్పీడు?

ఇటీవలే ‘కాటమరాయుడు’ సినిమాతో మన ముందుకొచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. త్రివిక్రమ్‌తో పవన్‌ చేస్తున్న సినిమా సినిమా కూడా పట్టాలెక్కేసింది. ఇంతవరకూ పవన్‌లో ఇంత స్పీడు లేదు. సినిమా కంప్లీట్‌ అయిన వెంటనే మరో సినిమాని తెరకెక్కించడం ఇదే తొలిసారి. ఈ సినిమాని వీలైనంత త్వరలోనే కంప్లీట్‌ చేసేస్తాడట. ఈ సినిమాలో ఇద్దరు భామలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వారిలో ఆల్రెడీ అనూఇమ్మాన్యుయేల్‌ సెట్స్‌లో సందడి చేసేస్తోంది.

మరో ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుందట. మరో పక్క నేశన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కే సినిమా కూడా లైన్‌లో పెట్టేస్తాడట పవన్‌. నేశన్‌తో పవన్‌ చేయబోయే చిత్రం ‘వేదాళం’ రీమేక్‌ అనుకున్నారు. కానీ రీమేక్‌ విషయాన్ని కొంచెం పక్కన పెట్టాడట. పవన్‌ కోసం నేశన్‌ ఆల్రెడీ కొత్త సబ్జెక్ట్‌ని తయారు చేసి పెట్టాడట. ఈ కొత్త స్టోరీనే ప్రస్తుతం సెట్స్‌ మీదికి తీసుకెళ్తాడట. అయితే ‘వేదాళం’ రీమేక్‌ కూడా ఖచ్చితంగా చేస్తానంటున్నాడు పవన్‌.

ఏ క్షణంలోనైనా ఈ సినిమాని పట్టాలెక్కించేయొచ్చునంటున్నాయి సినీ వర్గాలు. ఒకేసారి ఈ రెండు సినిమాలను పూర్తి చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం పవన్‌ స్పీడు అలా ఉంది మరి. 2019 ఎలక్షన్స్‌లో పవన్‌ పోటీ చేయనున్నాడు. అందుకే ఒప్పుకున్న సినిమాలన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడట. వీలైనంత త్వరలోనే ఈ సినిమాలన్నీ పూర్తి చేసి, పోలిటిక్స్‌లో బిజీ కావాలనుకుంటున్నాడట. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular