HomeMovie News Teluguతెలంగాణ సంపూ, ఆంధ్రాలో సూపర్‌ స్టార్‌

తెలంగాణ సంపూ, ఆంధ్రాలో సూపర్‌ స్టార్‌

సోషల్‌ మీడియా ద్వారా పాపులర్‌ అయిన కామెడీ హీరో సంపూర్ణేష్‌ బాబు. సంపూర్ణేష్‌కి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఏదో కామెడీ హీరో అన్నట్లుగా కాదు, తెరపై ఆయన చెప్పే డైలాగులు, డాన్సులు ఓహో ఓ రేంజ్‌లో ఉంటాయి. ఏదో తెలీని మ్యాజిక్‌ ఉంది సంపూలో. అయితే ఇదంతా సినిమా వరకే కాదు. ఈ మ్యాజిక్‌తో ఆయన ఇప్పుడు ఆంధ్రాలో కూడా పాపులర్‌ అయిపోయాడు. గణతంత్ర దినోత్సవం రోజు విశాఖలో ఆంధ్రా యువత చేపట్టిన, ‘ప్రత్యేక హోదా’పోరులో ఆయన కూడా భాగం పంచుకోవడం విశేషం.

ఈ నిరసన పోరు అనౌన్స్‌ అయిన రోజు నుండే సంపూ సోషల్‌ మీడియా ద్వారా తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ వచ్చారు. తన కామెంట్స్‌తో ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశారు. నేనొస్తున్నా, మీరు వస్తారా? అన్నందుకు మాట నిలబెట్టుకున్నారు. అయాన ఈ రోజు విశాఖకి వచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఆయన్ని పోలీసులు ఆరెస్టు చేశారు. అయినా కానీ తన సంఘీభావం తెలుపుతానని ఆయన అనడం మరో విశేషం.

ఓ తెలంగాణా వ్యక్తి అయినప్పటికీ, సంపూ ఆంధ్రా యువత కోసం ప్రత్యేక హోదా పోరుకు మద్దతు పలకడం, వారికి అండగా ఉండడం అభినందించదగ్గ విషయం. తెలంగాణా నుంచి వచ్చిన ఒక్కగానొక్క మగాడు సంపూ, సంపూ సపోర్ట్‌ని ప్రతీ ఆంధ్రుడు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. నిజమే సంపూ అసలు సిసలైన మగాడ్రా బుజ్జి! 

You May Like This
- Advertisment -spot_img

Most Popular