HomeMovie News Teluguబాహుబలితో దేవసేన సింప్లీ సూపర్బ్‌

బాహుబలితో దేవసేన సింప్లీ సూపర్బ్‌

రాజమౌళి అద్భుత తెర సృష్టి ‘బాహుబలి’ సినిమా. ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ సినిమా. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసిన సినిమా ఇది. ప్రబాస్‌, రానా, అనుష్క, రమ్యకృష్ణ ప్రధాన తారగణంగా నటించారు ఈ సినిమాలో. అయితే తొలి పార్ట్‌ ‘బాహుబలి ది బిగినింగ్‌’లో ముద్దుగుమ్మ అనుష్క ముసలి గెటప్‌లో డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించింది. అయితే రెండో పార్ట్‌లో మాత్రం అనుష్క అందాలు, ఆహార్యంతో ఆకట్టుకోనుందన్న సంగతి తెలిసిందే.

బాహుబలికి భార్యగా, రాణి పాత్రలో అనుష్క అదరగొట్టేయనుందట. అలాగే కత్తి యుద్ధాలు, విలువిద్యలో కూడా తన టాలెంట్‌ చూపించనుందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకే తాజాగా అనుష్క మహారాణిలా విల్లు ఎక్కుపెట్టిన పోస్టర్‌ ఒకటి విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ పోస్టర్‌లో ప్రబాస్‌, అనుష్క ఇద్దరూ సమానంగా విల్లు ఎక్కుపెట్టిన లుక్‌ ఎంతో రొమాంటిక్‌గా కనిపిస్తూనే అంతకన్నా హుందాగా కూడా అనిపిస్తోంది.

ప్రస్తుతం షూటింగ్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా అదిరిపోయే పోస్టర్‌ని విడుదల చేసింది. సినిమా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular