HomeMovie News Teluguరొమాంటిక్‌ హీరో అక్కినేని అఖిల్‌

రొమాంటిక్‌ హీరో అక్కినేని అఖిల్‌

తొలి సినిమా ‘అఖిల్‌’ తీవ్రంగా నిరాశపర్చడంతో తన కుమారుడు అక్కినేని అఖిల్‌ రీ లాంఛ్‌కి రంగం సిద్ధం చేయాల్సి వచ్చింది టాలీవుడ్‌ మన్మధుడు అక్కినేని నాగార్జునకి. రెండో సినిమా విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున, తనకు ‘మనం’ సినిమాతో మంచి సక్సెస్‌ ఇచ్చిన విక్రమ్‌ కుమార్‌ చేతిలో అఖిల్‌ని పెట్టేందుకు సర్వం సిద్ధం చేశాడు. తాజాగా విక్రమ్‌ – అఖిల్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే సినిమా కోసం స్క్రిప్ట్‌ పక్కా అయ్యిందట. నాగార్జున ఈ స్క్రిప్ట్‌ పట్ల పూర్తిగా నమ్మకంతో ఉన్నాడని సమాచారమ్‌.

ఇదొక రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ అనీ, అలాగే ఇందులో మంచి యాక్షన్‌ కూడా మిళితమై ఉంటుందనీ తెలియవస్తోంది. అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నాగార్జున నిర్మించనున్నారు. ఇంకో వైపున అఖిల్‌ సరసన హీరోయిన్‌ ఎవరు? అనే సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. మెహరీన్‌ కౌర్‌, అనుపమ పరమేశ్వరన్‌ తదితరుల పేర్లు వినవస్తున్నప్పటికీ కొత్త హీరోయిన్‌ అయితే బావుంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారట. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనీ, మెయిన్‌ హీరోయిన్‌ మాత్రం ఒకరేననీ సమాచారమ్‌.

తొలి సినిమా ‘అఖిల్‌’ కోసం బాలీవుడ్‌ నుంచి సయేషా సైగల్‌ని తీసుకొచ్చారు. డాన్సుల్లోనూ, యాక్టింగ్‌లోనూ ఆమె బాగానే చేసినా, సినిమా ఫలితం నిరాశపర్చింది. దర్శకుడిగా విక్రమ్‌ కుమార్‌ మంచి హిట్స్‌ ఇచ్చి ఉండటంతో అతని డైరెక్షన్‌లో అఖిల్‌ రీ లాంఛ్‌ అదిరిపోతుందనే ధీమాతో ఉన్నాడట అక్కినేని నాగార్జున.

You May Like This
- Advertisment -spot_img

Most Popular