HomeMovie News Teluguబన్నీ, దేవి మళ్ళీ స్టెప్పులేస్తారా?

బన్నీ, దేవి మళ్ళీ స్టెప్పులేస్తారా?

అల్లు అర్జున్‌, దేవిశ్రీప్రసాద్‌ మధ్య విడదీయలేని అనుబంధం ఏదో ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అనేక సినిమాలు మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. అలాగే బన్నీ సినిమా ప్రమోషన్‌ కోసం తనవంతుగా ఏదో మ్యాజిక్‌ చేస్తుంటాడు దేవిశ్రీప్రసాద్‌. ‘జులాయి’ సినిమా కోసం ప్రత్యేకంగా పకడో పకడో పాటని సృష్టించి, దుమ్ము రేపిన దేవిశ్రీప్రసాద్‌, అల్లు అర్జున్‌ తాజా చిత్రం ‘డిజె (దువ్వాడ జగన్నాథం)’కి కూడా అలాంటి ప్రయోగమేదో చేయబోతున్నాడని సమాచారమ్‌.

ఇంకో వైపున ఈ ఇద్దరూ కలిసి ఓ పాటలో కనిపించవచ్చునని టాలీవుడ్‌లో గాసిప్స్‌ వినవస్తున్నాయి. స్టేజ్‌ మీద తనదైన డాన్సులతో దుమ్మురేపేసే దేవిశ్రీప్రసాద్‌ చాలా అరుదుగా వెండితెరపై కన్పిస్తుంటాడు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలోనూ కాస్సేపు అలా అలా కనిపించాడు దేవిశ్రీప్రసాద్‌. అల్లు అర్జున్‌ డాన్సింగ్‌ స్టార్‌, అలాగే దేవిశ్రీప్రసాద్‌ రాక్‌ స్టార్‌ ఈ ఇద్దరూ కలిసి తెరపై డాన్సులేస్తే కెవ్వు కేక అనాల్సిందే అభిమానులు.

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ‘ముకుంద’ ఫేం పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్‌ శరవేగంగా పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రంపై నిర్మాణంలో ఉండగానే భారీ అంచనాలున్నాయి. దానికి కారణం అల్లు అర్జున్‌ ఈ మధ్య వరుస సక్సెస్‌లతో దూసుకుపోవడమే. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular