HomeMovie News Teluguవిలన్‌గా నాని, నిజమేనా?

విలన్‌గా నాని, నిజమేనా?

నేచురల్‌ స్టార్‌ నానికి విలన్‌గా నటించాలని ఉందంటున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే నానిని విలన్‌గా చూస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటున్నారా? అయితే నానికి చూపులతోనే భయపెట్టేంత విలనిజం చూపించగల టాలెంట్‌ ఉందట. అలాంటి విలన్‌ పాత్ర అయితేనే చేస్తానంటున్నాడు. అంతేకానీ మామూలుగా మొదట్లో నెగెటివ్‌గా ఉండి, సినిమా చివరికొచ్చేసరికి మంచిగా మారిపోయే విలన్‌గా నటించాలనుకోవడం లేదంట.

సినిమా చివరి వరకూ పవర్‌ఫుల్‌ విలన్‌గానే నటించాలన్నది పూర్తిగా విలన్‌ క్యారెక్టర్‌ చేయాలని నాని అనుకుంటున్నాడట. ఓరి నానీ వేషాలో! నిజమే నటుడిగా విభిన్న తరహా పాత్రల్లో నటించాలని అనుకోవడం తప్పేం కాదు. ఓ నటుడిగా నాని ఆటిట్యూడ్‌ మంచిదే. అలాగే ‘జెంటిల్‌మెన్‌’ సినిమాతో ఆల్రెడీ నెగిటివ్‌ షేడ్‌ పాత్రలో నాని మార్కులు కొట్టేశాడు. ఇక పూర్తి స్ధాయి విలన్‌ పాత్రే మిగిలి ఉంది.

అలాంటి కథతో ఎవరైనా తన వద్దకు వస్తే చేస్తానంటున్నాడు. కానీ, తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌ పాత్రలకు నటులు దొరకడం కష్టంగానే ఉంది. నాని చేస్తానంటే, ఛాన్సిచ్చేవాళ్ళు చాలామందే ఉన్నారు. పాత్రలపై ఇష్టం ఉండటం వేరు, చేయడానికి ముందుకు రావడం వేరు. నాని విలన్‌గా వస్తే మాత్రం టాలీవుడ్‌ యంగ్‌ హీరోలకు కరెక్ట్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ విలన్‌ నాని అవుతాడనిపించడంలో డౌటే లేదు. ఈ విషయంలో నానికి హేట్సాఫ్‌ అనాల్సిందే. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular