HomeMovie News Teluguమెగా ముహూర్తం ఎప్పుడు?

మెగా ముహూర్తం ఎప్పుడు?

చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ప్రారంభత్సవం అయిపోయింది. ఈ సినిమా కోసం రామ్‌ చరణ్‌ న్యూ లుక్‌ ట్రై చేయనున్నాడు. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ స్టోరీ అని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. తొలి సారిగా ఈ సినిమాతో సమంత, చరణ్‌తో జత కడుతోంది. అయితే సమంతది ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ రోలా? లేక గెస్ట్‌ రోలా అనేది తెలాయాల్సి ఉంది. మరో ముద్దుగుమ్మ రాశీఖన్నా కూడా ఈ సినిమాలో నటిస్తోంది.

ఇదంతా చరణ్‌ సినిమా సంగతి. 150వ సినిమాతో రికార్డులు తిరగ రాశాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఇక చిరంజీవి 151వ సినిమా స్టార్ట్‌ కావాల్సి ఉంది. ఈ సినిమాను సెట్స్‌ మీదికి తీసుకెళ్లేందుకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది చిత్ర యూనిట్‌. రామ్‌ చరణ్‌ నిర్మాణంలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముద్దుగుమ్మ అనుష్కని ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సురేందర్‌ రెడ్డి ఓ కథని ప్రిపేర్‌ చేయగా, ఆ కథని ప్రస్తుతం పరిశీలనలో ఉంచినట్లు తెలుస్తోంది.

చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్టు అయిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమాని తెర మీదికి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి స్టోరీని ప్రిపేర్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్‌. అయితే ఈ స్టోరీనే సురేందర్‌ రెడ్డి డైరెక్ట్‌ చేస్తాడా? లేక ఇంకేదైనానా? అసలు సూరి డైరెక్షన్‌లో వచ్చే మూవీ ఏంటా అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్సే. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular