HomeMovie News Teluguవావ్‌ మహేష్‌ ఈజ్‌ గ్రేట్‌

వావ్‌ మహేష్‌ ఈజ్‌ గ్రేట్‌

తన కుమార్తె సితార తన జీవితంలో లభించిన అతి గొప్ప గిఫ్ట్‌ అని చెప్పాడు మహేష్‌. ‘నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే’ సందర్భంగా సోషల్‌ మీడియాలో తన కుమార్తె సితార గురించి చెబుతూ ట్వీట్‌ చేశాడు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌. సినీ ప్రముఖుడిగా, లక్షలాదిమందిని ప్రభావితం చేయగల వ్యక్తిగా మహేష్‌, ‘నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే’ సందర్భంగా ఇచ్చిన మెసేజ్‌ అద్భుతం. సామాజిక బాధ్యత కోణంలో మహేష్‌ ఎప్పుడూ ముందుంటాడు.

గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్‌తో ‘శ్రీమంతుడు’ సినిమా చేయడమే కాకుండా, నిజ జీవితంలోనూ ఆచరించి చూపిస్తున్నాడు. ఈ సినిమాతో ఎంతో మందికి ఆదర్శం అయ్యారు మహేష్‌. ఈ సినిమాలో మహేష్‌ ఇచ్చిన మెసేజ్‌కి ఎంతో మంది ప్రముఖులు ఇన్‌స్పైర్‌ అయ్యి పలు గ్రామాల్ని దత్తత తీసుకుని వాటి అభివృద్దికి దోహదం అవుతున్నారు. ఈ రకంగా మహేష్‌కున్న సామాజిక బాధ్యత అమోఘం అని చెప్పొచ్చు. అలాగే ఈ మధ్యనే ‘జల్లికట్టు’పైనా స్పందించాడు మహేష్‌.

జల్లికట్టు ఉద్యమానికి తన పూర్తి మద్దతును ప్రకటించాడు. అంతేకాదు మహేష్‌ త్వరలోనే తన తాజా చిత్రం ‘సంభవామి’ తో తమిళ్‌ ప్రజలకు దగ్గర కానున్నారు. మురుగదాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular