HomeMovie News Teluguమెగా సినిమా కోసం పోటీ పడుతున్న ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు

మెగా సినిమా కోసం పోటీ పడుతున్న ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు

చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 రిలీజ్ అయి భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది.

ఈ కలెక్షన్స్ ప్రవాహం ఆగకముందే, చిరంజీవి 151వ సినిమా సందడి మొదలైంది. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ఈ చిత్రానికి ఇద్దరు సంగీత దర్శకులు పోటీ పడుతున్నారట. ఆ ఇద్దరిలో ఒకరు ఖైదీ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అలాగే ధృవ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్.

చిరంజీవి దేవి శ్రీ వైపు మొగ్గు చూపుతుండగా 151 ప్రొడ్యూసర్ రామ్ చరణ్ మాత్రం తన ధృవకి పనిచేసిన హిప్ హాప్ కి వోట్ వేస్తున్నాడట. మొత్తంగా చూస్తే హిప్ హాప్ చివరికి ఈ రేస్ లో గెలుస్తాడని అందరు అనుకుంటున్నారు. ధృవ డైరెక్టర్ సురేందర్ రెడ్డి చిరు 151 చిత్రానికి దర్శకత్వం వహించటమే హిప్ హాప్ కి కలిసే వచ్చే అంశం.

ఇక ఈ చిత్రం ప్రీ – ప్రొడక్షన్ విషయానికి వస్తే, సురేందర్ రెడ్డి ఇచ్చిన మూల కథను పరుచూరి బ్రదర్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసేసారట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular