ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 ‘ తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. అంతే కాదు గ్లోబల్ వైడ్ గా ఫాన్స్ ని సంపాదించుకున్నాడు. దీనితో బన్నీ చేయబోయే సినిమాలకి మంచి క్రేజ్, డిమాండ్ పెరిగాయి. బన్నీ ప్రజంట్ పాన్ ఇండియా దర్శకుడు అట్లీ తో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి మంచి హైపు నెలకొంది. కారణం పుష్ప సిరీస్ ల తరువాత బన్నీ నటిసున్న సినిమా కావటం, జవాన్ లాంటి భారీ హిట్ కొట్టిన అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కావటం. #AAA వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో భారీ కాస్టింగ్ ఉంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
ప్రస్తుతం AAA సెట్ లో ఉన్న బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా లైన్లో పెట్టాడని టాక్. ఈ మూవీ పూర్తి చేసాక త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్ట్ చేయనున్నాడట. పుష్ప 2 తరువాత బన్నీ త్రివిక్రమ్ తో చేయాల్సి ఉండగా అట్లీ కి ఓకే చెప్పాడు. ఈ క్రమంలో AAA పూర్తి అయ్యాక త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇస్తాడట బన్నీ. త్రివిక్రమ్ తరువాత బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తో కలిసి వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. పుష్ప మూవీతో బన్నీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇది డబ్బింగ్ సినిమా లెక్కలోకి వస్తుంది. ఇప్పుడు బన్నీ బాలీవుడ్ ఎంట్రీకి భన్సాలీ పెర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
వీటి తరువాత మలయాళ ఫిలిం డైరక్టర్ బాసిల్ జోసెఫ్ ని లైన్ లో పెట్టాడట. బాసిల్ మలయాళం నటుడిగా, దర్శకుడిగా సక్సెస్ ఫుల్ జర్నీ చేస్తున్నాడు. అతను చెప్పిన కథ నచ్చి బన్నీ బాసిల్ ని లాక్ చేసినట్లు సమాచారం . కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనక రాజ్ కూడా బన్నీ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాడట. కేజీఎఫ్, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్ NTR తరువాత బన్నీ తో వర్క్ చేయనున్నాడట. సందీప్ వంగా కూడా బన్నీ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రభాస్ స్పిరిట్ పూర్తి అయిన తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కవచ్చు.





