HomeMovie News Teluguమహేష్ తరువాత ప్రభాస్ తో..

మహేష్ తరువాత ప్రభాస్ తో..

గత ఏడాది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబోలో ‘కల్కి 2898 AD ‘ మూవీ వచ్చింది. ఈ మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టింది. ఇంటర్నేషనల్ లెవల్ లో కూడా మంచి పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. అంతే కాదు బాక్సాఫీస్ లోని పలు రికార్డులను బ్రేక్ చేసి, కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. భారీ కాస్టింగ్, టైం కాన్సెప్ట్ జోనర్ తో కల్కి ఇండియన్ సినిమా పై ఆసక్తి పెంచింది. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలక్షన్లు సాధించింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ పాన్ వర్డల్ హీరో అయిపోయాడు. హాలీవుడ్ హీరోలకి సమానంగా పేరు, పాపులారిటీ తెచ్చుకున్నాడు.

అందుకే సీక్వెల్ గా ‘కల్కి 2’ రానుంది. ఈ మూవీలో సుమతి పాత్రలో మెప్పించిన దీపికా పదుకునే సీక్వెల్ లో నటించటం లేదు. దీపికా పాత్రలో ఇప్పడు వేరే వారిని ఊహించుకోవటం కష్టమే. కానీ దీపికా డిమాండ్స్ కి మేకర్స్ నో చెప్పటంతో ఇప్పుడు దీపిక ప్లేస్ లో వేరే హీరోయిన్ కోసం సెర్చింగ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కల్కి 2 లో దీపిక కి ధీటుగా ఉండే హీరోయిన్, దీపిక కంటే క్రేజ్ ఉన్న బాలీవుడ్ భామని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఆ భామ ఎవరో కాదు గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా. పీసీ ఇప్పటికే మహేష్ – రాజమౌళి కాంబో వారణాసి లో నటిస్తోంది. దీపిక ప్లేస్ లో సాయి పల్లవి, అనుష్క శెట్టి, శ్రుతి హాసన్ పేర్లు ప్రచారం లోకి వచ్చాయి. కానీ అవన్నీ వదంతులని, ప్రియాంకా చోప్రా ఫైనల్ అని తెలుస్తోంది. ప్రియాంక కి గ్లోబల్ లెవెల్ ఫాలోయింగ్ ఉంది. కల్కి కూడా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఆకట్టుకుంది. సో ప్రియాంకా కల్కి సీరిస్‌కి బెస్ట్ ఛాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారట. వారణాసి సినిమా క్రేజ్ కూడా కల్కికి యాడ్ అవుతుందని మేకర్స్ భావన. ప్రభాస్ – ప్రియాంకా జోడీ సూపర్ గా ఉంటుందని ఫాన్స్ హుషారుగా ఉన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular