HomeMovie News TeluguGlobeTrotter: పాస్ ఉన్నవారే రండి.. ఫ్యాన్స్‌కు మహేశ్ బాబు కీలక సూచనలు!

GlobeTrotter: పాస్ ఉన్నవారే రండి.. ఫ్యాన్స్‌కు మహేశ్ బాబు కీలక సూచనలు!

దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గ్లోబ్ ట్రోటర్’ (GlobeTrotter) సినిమా కోసం అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. మహేశ్ బాబు కెరీర్‌లో ఇది 29వ సినిమా (SSMB29) కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పబ్లిక్ ఈవెంట్ నవంబర్ 15వ తేదీ సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తన అభిమానులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు.

తాజాగా మహేశ్ ఓ వీడియో రిలీజ్ చేస్తూ ఇలా అన్నారు..

“దయచేసి పాస్ ఉన్నవారే ఈవెంట్‌కి రండి. పాస్ లేకుండా వస్తే లోపలికి అనుమతి ఉండదు, ఇబ్బందులు పడొద్దు. రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ మూసివేయబడుతుంది. పాస్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేస్తే గూగుల్ మ్యాప్ ద్వారా బ్యాక్ గేట్‌కి దారి చూపుతుంది. దానిప్రకారం రావాలి,” అని తెలిపారు.

అలాగే ఆయన అభిమానులకు మరిన్ని సూచనలు కూడా ఇచ్చారు..

“పోలీసులు చాలా స్ట్రిక్ట్ సెక్యూరిటీ రూల్స్ అమలు చేస్తున్నారు, దయచేసి వారికి సహకరించండి. వీలైనంత తక్కువ వాహనాలతో రండి. సేఫ్‌గా వచ్చి సేఫ్‌గా వెళ్లండి. రేపు ఈవెంట్‌లో కలుద్దాం,” అని మహేశ్ చెప్పారు.

ఈ ఈవెంట్‌లో సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియో విడుదల కానుంది. రాజమౌళి–మహేశ్ కాంబోలో వస్తున్న ఈ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌పై భారతీయ సినిమా ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular