జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఫలితాల అనంతరం మాగంటి సునీత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
తన ట్వీట్లో ఆమె పేర్కొంటూ..
“స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు, జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. నాపై నమ్మకం ఉంచి ఓటేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని రాసుకొచ్చారు.
స్వర్గీయ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి ఆశయాలను నెరవేర్చేందుకు, జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా నిలబడేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నాపై నమ్మకంతో నాకు ఓటేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
— Maganti Sunitha Gopinath (@magantigopimla) November 14, 2025
బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఎంతగానో కష్టపడి పనిచేసిన నాయకులకు,… pic.twitter.com/Y6xfpBfv4g
అలాగే పార్టీ తరఫున విజయం సాధించేందుకు కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
“ఈ ఎన్నికల్లో ఓడిపోయినా, అదే అంకితభావంతో ప్రజాసేవలో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను,” అని మాగంటి సునీత అన్నారు.
తన భర్త, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆశయాలను కొనసాగించే దిశగా తాను కృషి చేస్తానని ఆమె పునరుద్ఘాటించారు.





