కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన లోకేష్, ఇప్పుడు దర్శకత్వానికి తాత్కాలికంగా విరామం ఇచ్చి హీరోగా స్క్రీన్‌పై కనిపించడానికి సిద్ధమవుతున్నారు.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆయన నటనతో తెరకెక్కనున్న తొలి సినిమా అరుణ్ మథేశ్వరన్ (Arun Matheswaran) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. తాత్కాలికంగా ‘DC’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రాజెక్ట్ కొనసాగుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి (Wamika Gabbi) హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. స్టైలిష్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో, బలమైన ఎమోషనల్ టచ్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి, త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన నటనా అరంగేట్రం (Debut film) కోసం లోకేష్ కనగరాజ్ ఏకంగా రూ. 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. ఇందులో నిజమెంత అనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇది నిజమైతే, డెబ్యూ సినిమాకే ఇంత భారీ పారితోషికం తీసుకున్న తొలి హీరోగా లోకేష్ చరిత్ర సృష్టించబోతున్నాడు అని సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.





