HomeMovie News Telugu‘ది ప్యారడైజ్’ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ సోనాలి.. అధికారిక ప్రకటన విడుదల

‘ది ప్యారడైజ్’ సినిమాలో నేషనల్ అవార్డు విన్నర్ సోనాలి.. అధికారిక ప్రకటన విడుదల

నేచురల్ స్టార్ నాని మరియు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన దసరా సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ మళ్లీ కలసి మరో భారీ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు. ఆ సినిమా పేరు ‘ది ప్యారడైజ్’ (The Paradise).

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. కాగా, తాజాగా సినిమా టీమ్ ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత సోనాలి కులకర్ణి కీలక పాత్రలో నటించనున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, అధికారిక పోస్టర్ విడుదల చేసింది.

టీమ్ విడుదల చేసిన నోట్‌లో,

“సోనాలి కులకర్ణి వాయిస్ ‘రా స్టేట్‌మెంట్: గ్లింప్స్’లో వినిపించగానే ఇంటర్నెట్‌లో తుఫాన్ లేచింది. ఆమె నటన ఈ చిత్రంలో ఒక సంచలనం అవుతుంది” అని పేర్కొన్నారు.

అదే పోస్టులో సోనాలి గ్లీన్ కలర్ చీరలో, సంప్రదాయ నగలతో ఉన్న అందమైన ఫొటోను షేర్ చేశారు.

ఇక ది ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, కయ్యదు లోహర్ నాని సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ సమకూరుస్తున్నారు.

ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలి, ఇంగ్లీష్, స్పానిష్.. మొత్తం 8 భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular