HomeMovie News Telugu‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్‌పై దూసుకెళ్తోంది.. రూ. 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!

‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్‌పై దూసుకెళ్తోంది.. రూ. 400 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ!

పాన్-ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన రిషబ్ శెట్టి తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన ఆరు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్ కొనసాగిస్తూ, దేశవ్యాప్తంగా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా కన్నడ, హిందీ వెర్షన్లకు ప్రేక్షకుల నుంచి అపారమైన స్పందన వస్తోంది.

తాజాగా మేకర్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 427.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం విశేషం. ఇక ఈ వేగం చూస్తుంటే, సినిమా త్వరలోనే రూ. 500 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మొదటి భాగానికీ మించి ‘చాప్టర్ 1’
రిషబ్ శెట్టి తెరకెక్కించిన తొలి ‘కాంతార’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అయితే తాజా చాప్టర్ 1 ఆ సినిమాకి లైఫ్‌టైమ్ కలెక్షన్లను కూడా అధిగమించింది. ఈ విజయం ద్వారా రిషబ్ శెట్టి తన ప్రతిభను, మార్కెట్ రేంజ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సాండల్‌వుడ్ ఆల్‌టైమ్ సెకండ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది.

కాస్ట్ అండ్ టెక్నికల్ టీమ్ వివరాలు
హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత హీరోయిన్‌గా, గుల్షన్ దేవయ్య విలన్‌గా నటించారు. అలాగే ప్రముఖ నటుడు జయరామ్ కీలక పాత్రలో కనిపించారు. సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ అందించారు.

ఈ సినిమా విజయానికి రిషబ్ శెట్టి దర్శకత్వం, బలమైన కథ, సాంస్కృతిక విలువల సమ్మేళనం, అద్భుతమైన విజువల్ ప్రెజెంటేషన్ ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు సినీ విశ్లేషకులు. హిందీ వెర్షన్‌కూ విపరీతమైన ఆదరణ లభించడం మరో విశేషం.

ప్రస్తుతం వసూళ్ల పరంగా చూస్తే, ‘కాంతార: చాప్టర్ 1’ త్వరలోనే రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular