చిత్రం: టాక్సిక్
దర్శకత్వం: గీతూ మోహన్ దాసు
కథ – రచన: యశ్. గీతూ మోహన్ దాసు.
నటీనటులు: యశ్, కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంతన్, తారా సుతారియా, హుమా ఖురేషీ, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ తదితరులు
నిర్మాతలు: వెంకట్ కే నారాయణ, యశ్.
సంగీతం: రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి
ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి
బ్యానర్: కేవీఎన్ ప్రొడక్షన్స్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్
విడుదల తేదీ: 26 ఆగస్టు 2026
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 2/5
కేజీఎఫ్ సిరీస్ లతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు యశ్.కేజీఎఫ్ 2 తరువాత యశ్నుంచి ఏ సినిమా వస్తుందా అని ప్రేక్షుకుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మూడేళ్ళ గ్యాప్ తరువాత టాక్సిక్ సినిమాతో థియేటర్స్ లో సందడి చేసేందుకు యశ్ వచ్చాడు. టీజర్, ట్రైలర్ టాక్సిక్ పై అంచనాలను పెంచాయ్యి. గ్యాంగ్‌స్టర్ పీరియాడికల్ డ్రామాని ఒక లేడీ డైరక్టర్ ఎలా డీల్ చేసిందో చూడాలని ఆడియన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. పైగా ఐదుగురు హీరోయిన్స్ ఉండటం టాక్సిక్ అంచనాలను పెంచింది. ఈ బుధవారం రిలీజ్ అయిన టాక్సిక్ ఎలా ఉంది? కేజీఎఫ్ తో వచ్చిన ఫేమ్ ని యశ్ టాక్సిక్ తో నిలబెట్టుకున్నాడా? లేదా ఈ రివ్యూలో చూద్దాం .
కథ:
ఇండియా కి స్వంత్రత్యం వచ్చినా గోవాని మాత్రం పోర్చుగీసులే పాలిస్తుంటారు. గోవాకి సాల్వడర్ కింగ్ మేకర్ గా ఉంటాడు. అతని ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు స్వయానా తమ్ముడు ఫెర్నాండేజ్ ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే టైం లో ఫెర్నాండేజ్‌ను చంపి సాల్వడర్‌కు దగ్గరవుతారు రాయ (యశ్), సోదరి గంగ (నయనతార). రాయ గోవా మీద పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రాయని చూసి ఫెర్నెండేజ్ కూతురు రెబెకా (తారా సుతారియా) ప్రేమలో పడుతుంది. రాయ పాపులారిటీ, దైర్యం, దమ్ము చూసి సాల్వడర్ తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. సాల్వడర్ లాంటి గొప్పవాడికి రాయ అల్లుడుకానున్నాడని కొందరు సంతోష పడతారు, ఇంకొందరు ఈర్ష్య పడుతుంటారు. కానీ అప్పుడే కథలోకి నాదియా (కియారా అద్వానీ) ఎంట్రీ ఇస్తుంది. నాదియా రాకతో రాయ జీవితం మొత్తం తారుమారు అవుతుంది. నాదియాతో ప్రేమలో పడ్డ రాయ జీవితంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. నాదియా కోసం సాల్వడర్ ని ఎదిరించి, తన ప్రాణం అయిన అక్క గంగతో పాటు, పెళ్లి చేసుకోవాలనుకున్న రెబెకాని కూడా కోల్పోతాడు. అనుకోని కారణాల వలన గంగను నాదియానే చంపాల్సి వస్తుంది. ఇది తెలిసిన రాయ నాదియాని ద్వేషిస్తూ, ఆమెను దూరం పెడతాడు. చివరికి నాదియా కథ ఏమవుతుంది? ఆమెను తిరిగి రాయకలుసుకుంటాడా ? గంగను నాదియా ఎందుకు చంపింది? రాయ లైఫ్‌లో మెల్లిసా (రుక్మిణి వసంత్) పాత్ర ఏంటి ? రాయ సామ్రాజ్యాన్నిఎదురుతిరిగిన రూమీ (యశ్) కథ ఏంటి? ఎవరు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
యశ్ నుంచి ఒక సినిమా వస్తోంది అంటే భారీ అంచనాలుండటం మామూలు విషయమే. ప్రమోషన్ కంటెంట్ కూడా సినిమా పై అంచనాలు పెంచింది. ఫస్ట్ హాఫ్ పరవలేదనిపించినా సెకండ్ హాఫ్ మైనస్ అయిపొయింది. ఓపెనింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఇంట్రెస్ట్ గా నడిచిన కథ , కథనం సెకండ్ హాఫ్ లో గందరగోళంగా తయారయ్యింది. ఓపెనింగ్ సీన్ లో కియారా అద్వానీని చూపించి కథపై ఆసక్తి పెంచారు. వెంటనే కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. రాయ జర్నీ, బాల్యం, అక్క తమ్ముడి రిలేషన్, వారి కష్టాలు అన్నీ చూపిస్తూ , అంచలంచెలుగా రాయఎదుగుదల చూపిస్తాడు. అసలు రాయ ఎవరి కోసం కష్టపడుతున్నాడు, రాయకి కావాల్సిందేంటి అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ పవర్ ఫుల్ గా ప్రజంట్ చేసింది దర్శకురాలు. కానీ ఎక్కువగా గన్స్, బాంబులు పేలాయి తప్ప స్క్రీన్ ప్లే, కథ ఆకట్టుకోలేదు. కేజీఎఫ్ లో అల్ రెడీ యశ్ స్టామినా, ఫైట్స్ చూసేసిన జనాలకి టాక్సిక్ పెద్దగా కిక్ ఇవ్వలేదు. కాకపోతే యశ్ స్టైలిష్ యాక్షన్, ఫైట్స్ కంపోజిషన్ బాగుంది. లాజిక్స్ లేకుండా ఒకర్ని ఒకరు చంపుకోవటం, కాల్చుకోవటం సినిమా మొత్తం కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా కథని డిస్ట్రాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఫాస్ట్ హాఫ్ లో ఒక సినిమా, సెకండ్ హాఫ్ లో ఒక సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కారణం ఫస్ట్ హాఫ్ లో ఉన్న కీలక పాత్రలు సెకండ్ హాఫ్ లో లేకపోవటం, కథ పక్కదారి పట్టడం.
రాయ రాయల్టీ, బిహేవియర్ మొత్తం మారిపోయి, రాయ ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అనిపిస్తుంది. కొడుకు పాత్రలోఆడియన్స్ కి కొత్త యశ్ ని పరిచయం చేసింది గీతూ మోహన్ దాసు. ప్రీ క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షుకులుని అలరించలేదు సరి కదా, సినిమాకి అదే మైనస్ గా మారింది. చివరికి ఇదొక సైకలాజికల్ డ్రామా అని తేల్చి పడేసారు. ప్రేక్షకులకి ట్విస్ట్ ఇచ్చి కథని మలుపు తిప్పాము అనుకుని చతికిలపడినట్టు అయ్యింది. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో కొన్ని సినిమాలు వచ్చాయి. మాఫియా, డ్రగ్స్, గన్స్, అమ్మాయిలు సినిమా మొత్తం ఇవే కనిపిస్తాయి. అసలు ఎందుకు చంపుకుంటున్నారో, ఎవరు ఎవర్ని కాలుస్తున్నారో ? ఎందుకు కాలుస్తున్నారో కూడా అర్థం కాదు. తెలుగు నటీ నటులు ఎవరు లేరు. కేవలం యశ్, నయనతార, కియారా మాత్రమే తెలుగు ప్రేక్షకులకి తెలిసినవాళ్ళు. ఫైనల్ గా ఇదొక లవ్ స్టోరీ నా, మాఫియా కథా, లేక సైకిలాజికల్ స్టోరీనా అని ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు. యష్ స్టైలిష్ యాక్షన్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకి ప్లస్. ఎమోషన్స్ పెద్దగా వర్కౌట్ అవలేదు. అర్థం లేని కారణం తో ప్రాణంగా ప్రేమించిన ప్రియురాల్ని ద్వేషిస్తూ దూరం పెట్టడం , ఏ పాపం తెలియని సొంత కొడుకుని అనాథలా వదిలేయటం, లాంటివి యశ్ ని విలన్ చేసాయి.
నటీ నటులు:
రాయ పాత్రలో యశ్ నటనకి వంకలు పెట్టడానికి లేదు. యశ్ కటౌట్ చూసి ప్రేక్షుకు లు లాజిక్స్ కూడా మర్చిపోతారు. తండ్రి కొడుకు పాత్రల్లో కంప్లీట్ వేరియేషన్స్ తో యశ్ మెస్మరైజ్ చేసాడు. యశ్ స్వాగ్, స్టైల్ కి ఆడియన్స్ మరొకసారి ఫిదా అయిపోయారు. కేజీఎఫ్ హ్యాంగోవర్‌ని యశ్ మెయింటైన్ చేసాడని చెప్పొచ్చు. యశ్ ని ఇప్పటివరకు చూడని ఇంకొక గెటప్ లో పరిచయం చేసి ఫాన్స్ కి కిక్ ఇచ్చింది గీతూ మోహన్ దాస్. నయనతార సిస్టర్ పాత్రలో చాలా కీ రోల్ ప్లే చేసింది. యాక్షన్ సీన్స్‌లో కూడా స్టైలిష్‌గా కనిపించింది. కియారా అద్వానీకి కీ రోల్ దొరికింది. కథ మొత్తం తన పాత్ర చూట్టు తిరుగుతూ ఉంటుంది. అందాలు ఆరబోతతో పాటు నటనకి స్కోప్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంది. హుమా ఖురేషి పాత్రకి ఇంపార్టెన్స్ ఉంది. తారా సుతారియా పాత్రకి, నటనకి స్కోప్ లేదు. తారా స్క్రీన్ ప్రెజెన్సీ బాగుంది. రుక్మిణి వసంత్ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు. అసలు రుక్మిణి ఈ పాత్రకి ఎందుకు ఒప్పుకుంది అనిపిస్తుంది. యశ్ లాంటి స్టార్ హీరో, పాన్ ఇండియా మూవీ అని ఎస్ చెప్పి ఉంటుంది. సుదేవ్కి స్క్రీన్ ప్లేస్ ఎక్కువే ఉంది. మిగతా నటీ నటులంతా తమ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
టెక్నికల్:
దర్శకురాలు గీతు మోహన్ దాస్ హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఒక లేడీ మాఫియా స్టోరీని తెరకెక్కించటం, బోల్డ్ సీన్స్ చూపించటం గొప్పవిషయం గా చెప్పాలి. యష్ ని చాలా స్టైలిష్ గా చూపించింది. రవి బ్రసూర్ సంగీతం కెజిఫ్ సినిమాతో పోలీస్తే మైనస్ అని చెప్పాలి. సినిమా మొదటి నుంచి చివరి వరకు పెద్దగా వేరియేషన్స్ లేకుండా మోత మోగిస్తూనే ఉన్నాడు. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి ప్లస్ అయ్యింది. వీఎఫ్ఎక్స్ షాట్స్ హాలీవుడ్ సినిమాని తలపిస్తూ ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్నీ సెట్స్ లగ్జరీగా ఉన్నాయి. ఎడిటింగ్ విషయం లో ఇంకొంచెం శ్రద్ద పెట్టి నిడివి తగ్గిస్తే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
యశ్
సినిమాటోగ్రఫీ,
గ్రాండ్ విఎఫ్ఎక్స్
రిచ్ సెట్స్
యాక్షన్ సీన్స్
ఇంటర్వెల్ బ్యాంగ్,
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్
కథ
లాజిక్స్ మిస్సింగ్
సినిమాటిక్ ఫ్రీడమ్
వయలెన్స్
ఫైనల్ వర్దిక్ట్ : పెద్దగా కిక్ ఇవ్వని ‘టాక్సిక్’
Click Here To Read Review in English





