HomeTeluguజన నాయకుడు మూవీ రివ్యూ & రేటింగ్

జన నాయకుడు మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: జననాయకుడు
దర్శకత్వం: హెచ్. వినోద్
కథ – రచన: హెచ్. వినోద్

నటీనటులు: దళపతి విజయ్, పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, రేబా మోనికా జాన్ , ప్రకాశ్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సునీల్, రేవతి, బాబా భాస్కర్ , నిలల్ గల్ రవి తదితరులు

నిర్మాతలు: వెంకట్ నారాయణ కే

సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
ఎడిటర్: ప్రదీప్ రాఘవ్ . ఇ

బ్యానర్: కేవీఎన్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 23 జూలై 2026

కోలీవుడ్ స్టార్ హీరో జోసెఫ్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం తో సినిమాలకి గుడ్ బై చెప్పేసారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేసేముందు జన నాయకుడు అనే సినిమా చేసారు. హెచ్ వినోద్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ పొలిటికల్ జర్నీ కి ఉపయోగపడేలా తీర్చి దిద్దారు. కానీ ఎన్నికలముందు ఈ సినిమా రిలీజ్ కాలేదు. విజయ్ సీఎం గా ఘనవిజయం సాధించాకా ఫైనల్ గా ఇప్పుడు జననాయకుడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ కథ అనీల్ రావి పూడి బాలయ్య కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి అని తెలుస్తోంది. మొత్తం రీమేక్ కాకపోయినా కొన్ని సీన్స్ రీమేక్ చేసినట్టు తెలుస్తోంది. విజయ్ ఫాన్స్ ఎంతగానో ఎదురు చూసిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ఎలా ఉంది? విజయ్ ‘జననాయకుడు’ విజయం సాదించిందా? లేదా? ఈ రివ్యూ లో చూద్దాం .

కథ :

వెట్రి కొండన్ (దళపతి విజయ్), విజ్జు (మమతా బైజు)ని పెంచుకుంటాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ తన లైఫ్ అంతా విజ్జు కోసమే అన్నట్టు బతుకుతూ ఉంటాడు. అనుకోకుండా ఒకరోజు విజ్జు సీఎం చేతికి ఒక ఫైల్ ఇస్తుంది. ఆ కారణంగా హిమ్లర్ (బాబీ డియోల్) గ్యాంగ్ కి టార్గెట్‌ అవుతుంది. విజ్జుని చంపడానికి హిమ్లర్ గ్యాంగ్ వేటాడుతుంటుంది. దళపతి విజ్జుని కాపాడే ప్రయత్నం లో హిమ్లర్ గ్యాంగ్ కి ఎదురెళ్తాడు? అసలు హిమ్లర్ గ్యాంగ్ కథ ఏంటి? వారు ఎవరు? విజ్జు సీఎం చేతికి ఇచ్చిన ఫైల్ ఏంటి? విజ్జు వెనక హిమ్లర్ గ్యాంగ్ పడటానికి కారణం ఏంటి? దళపతి విజ్జుకి బంధం ఎలా ఏర్పడింది? ఆ నేపథ్యం ఏమిటి? కయల్ (పూజా హెగ్డే) పాత్ర ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

మొదటి నుంచి ఈ సినిమా కథ భగవంత్ కేసరి అని ప్రచారం జరుగుతూనే ఉంది. సినిమా చూసాక భగవంత్ కేసరి కథనే చిన్న చిన్న మార్పులు చేసారు అనిపిస్తుంది. వెట్రి ఓపెనింగ్ సీన్ మధురై జైలులో ఖైదీగా కనిపిస్తాడు.వెట్రి జైలుకి వెళ్ళటానికి కారణం తల్లి (రేవతి). జైలులో ఉన్నా వెట్రిని అంతా గొప్పగా చూస్తారు. వెట్రిని హత్య చేసేందుకు 20 సార్లు ప్రయత్నాలు జరిగినా తప్పించుకుంటాడు. “దళపతి మన రక్షణలో లేడు, మనమే ఆయన రక్షణలో ఉన్నాం” అన్న జైలు అధికారి ( నిలల్ గల్ రవి) డైలాగ్ విజయ్ పాత్రని ఎలివేట్ చేస్తుంది. ఇవన్నీ భగవంత్ కేసరి ఓపెనింగ్ సీన్స్. జైలు వార్డెన్ శ్రీకాంత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) సాయంతో తన తల్లిని చూసేందుకు వెట్రివేళ్ళటం, తర్వాత ఆగస్టు 15న క్షమాభిక్ష ద్వారా వెట్రి జైలు నుంచి రిలీజ్ అవ్వటం, జైలు వార్డెన్ శ్రీకాంత్ కూతురు విజ్జి(మమితా బైజు)తో ఎమోషనల్ బాండింగ్, అనుకోకుండా ఓ ప్రమాదంలో జైలు వార్డెన్ శ్రీకాంత్ చనిపోవడంతో విజ్జి బాధ్యతను వెట్రి తీసుకుని, ఆర్మీ ఆఫీసర్ ను చేయాలన్న ప్రయత్నాలు అన్నీ భగవంత్ కేసరి సీన్స్. భగవంత్ కేసరి అర్జున్ రామ్ పాల్ విలన్, జననాయకుడులో బాబీ డియోల్ విలన్.

కాకపొతే ‘భగవంత్ కేసరి’ రీమేక్ అన్న ఫీలింగ్ తమిళ ఆడియన్స్‌కి రాకుండా విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్ రాసుకున్నాడు దర్శకుడు. ఒక పవర్ఫుల్ కాన్ఫ్లిక్ట్ కూడా రాసుకున్నాడు. కానీ పూర్తిస్థాయిలో తెరకెక్కించటం లో ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ‘భగవంత్ కేసరి’ స్ట్రైట్ గా ఒకే పాయింట్ చెప్పాడు. జననాయకుడులో విజయ్ పొలిటికల్ కెరియర్ ని, ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని గందరగోళాన్ని సృష్టించాడు దర్శకుడు. పొలిటికల్ సెటైర్లు, మత రాజకీయాల గురించి ప్రస్తావనలతో విజయ్ పొలిటికల్ క్యాంపైన్ లాగా నడిచింది జననాయకుడు. ఫస్ట్ హాఫ్ భగవంత్ కేసరి చూస్తున్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ లో సామాజిక అన్యాయాలు, అవినీతి, మహిళా సాధికారత, రాజకీయ వ్యవస్థపై వెట్రి చేసే పోరాటం ఆసక్తిగా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయినా తమిళ ఆడియన్స్ కి, ప్రత్యేకంగా విజయ్ ఫాన్స్ ని మెప్పించేలా ఉన్నాయి హీరో ఎలివేషన్స్, డైలాగ్స్.

నటీ నటులు:

ఎప్పటిలా విజయ్ తన నటనతో, స్టైల్ తో ఆకట్టుకున్నారు. ఫాన్స్ కి మంచి ఫీస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. విజయ్ కి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. ఈ పాత్రలో విజయ్ నటన హుందాగా ఉంది. విజయ్ రియల్ లైఫ్ స్పీచ్ లలోని పంచ్ డైలాగ్స్ థియేటర్లలో విజల్స్ వేయించాయి. విజయ్ డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్సులు అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. భగవంత్ కేసరి లో శ్రీలీల పాత్రకి మంచి పేరు వచ్చింది కానీ జననాయకుడు లో మమితా పాత్ర తేలిపోయింది. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. పూజా హెగ్డే పాత్ర కూడా గొప్పగా లేదు కేవలం కొన్ని సీన్లకే పరిమితమైంది. బాబీ డియోల్ కి మంచి పాత్ర దొరికింది. నటనకి అవకాశమున్న హిమ్లర్ రోల్ లో బాబీడియోల్ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యారు. ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా ఆకట్టుకున్నారు. మిగతా నటీ నటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్:

‘భగవంత్‌ కేసరి’ కథను తీసుకుని దానిని విజయ్ ఇమేజ్ కి తగినట్టు మలిచాడు దర్శకుడు వినోద్. కానీ భగవంత్ కేసరి లో ఉన్న ఎమోషన్స్ జననాయకుడులో మిస్ అయ్యాయనిపిస్తుంది. విజయ్ ఫాన్స్ ని, మాస్ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఎప్పటిలానే అనిరుథ్‌ అందించిన మ్యూజిక్ బాగుంది. పాటలు, బీజియం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. హీరో ఎలివేషన్స్ కి అనిరుద్ అందించిన బీజియం ప్లస్ అయింది. క్లైమాక్స్, యాక్షన్ సీన్లలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి థియేటర్లు దద్దరిల్లేల్లా ఉన్నాయి. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ పై ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. కేవీఎన్ సంస్థ నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. జననాయకుడికి టెక్నీకల్ టీమ్ ప్లస్ అయ్యింది.

ప్లస్ పాయింట్స్

విజయ్
యాక్షన్ సీన్స్, హీరో ఎలివేషన్స్
అనిరుద్
బాబీడీయోల్

మైనస్ పాయింట్స్

బలమైన ఎమోషన్స్ లేకపోవటం
నిడివి
పొలిటికల్ డ్రామా

You May Like This
- Advertisment -spot_img

Most Popular