గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్రబృందానికి శుభవార్త చెప్పింది. సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సాధారణ టికెట్ ధరపై అదనంగా రూ.100, మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రతి టికెట్‌పై అదనంగా రూ.125 వసూలు చేసుకునే అవకాశం కల్పించింది.
అలాగే జూన్ 3న రాత్రి నిర్వహించే ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా రూ.600 వరకు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టికెట్ ధరల పెంపు సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉండనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పెద్ది చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు మద్దతు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు” అని రామ్ చరణ్ తన పోస్టులో పేర్కొన్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెద్ది టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వగా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిత్రబృందం మరింత ఉత్సాహంగా ఉంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
My sincere gratitude to Hon’ble Chief Minister @revanth_anumula Garu, Hon’ble Deputy Chief Minister @Bhatti_Mallu Garu, Hon’ble Cinematography Minister @KomatireddyKVR Garu, and the Government of Telangana for your support and constant encouragement for the betterment of Telugu…
— Ram Charan (@AlwaysRamCharan) June 3, 2026





