HomePolitics Teluguసీఎంగా డీకే శివకుమార్.. ముహూర్తం ఫిక్స్..!

సీఎంగా డీకే శివకుమార్.. ముహూర్తం ఫిక్స్..!

కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా జూన్ 3న బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోగా, ఆయన స్థానంలో డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. బెంగళూరులోని రాజ్‌భవన్ గ్లాస్ హౌస్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. డీకే శివకుమార్‌తో పాటు తొలి విడతలో ఎనిమిది నుంచి పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగిలిన మంత్రి పదవుల భర్తీని రాజ్యసభ ఎన్నికల అనంతరం పూర్తి చేయనున్నారు. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో జరిగిన సమావేశాల అనంతరం అధికార మార్పిడిపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో కర్ణాటకలో కొత్త నాయకత్వానికి మార్గం సుగమమైంది.

2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య అధికార భాగస్వామ్యంపై చర్చ కొనసాగింది. ఆ క్రమంలో సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత డీకే శివకుమార్‌కు అవకాశం కల్పించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త దశలోకి అడుగుపెట్టింది. పార్టీని బలోపేతం చేయడం, రాబోయే ఎన్నికలకు సిద్ధం చేయడం లక్ష్యంగా డీకే శివకుమార్ పనిచేయనున్నారు.

కొత్త మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కనుందన్న అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. అనుభవజ్ఞులైన నేతలతో పాటు యువ నాయకులకు కూడా అవకాశం కల్పించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటోంది. మొత్తానికి, డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లైంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular