HomeMovie News Teluguలూగర్ గా ఎన్టీఆర్.. ఆ పేరుకి అసలు అర్థం ఇదేనా?

లూగర్ గా ఎన్టీఆర్.. ఆ పేరుకి అసలు అర్థం ఇదేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ గ్లింప్స్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

గ్లింప్స్‌లో ఎన్టీఆర్ పూర్తి రగ్గడ్ మాస్ లుక్‌లో కనిపించారు. ఆయన స్టైల్, బాడీ లాంగ్వేజ్, పవర్‌ఫుల్ డైలాగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ గ్లింప్స్‌లో ఎక్కువగా చర్చకు దారితీసిన విషయం.. ఎన్టీఆర్ పాత్ర పేరు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పేరు LUGER అని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో సోషల్ మీడియాలో లూగర్ అనే పదానికి అర్థం ఏమిటి? అనే చర్చ మొదలైంది. గూగుల్ సమాచారం ప్రకారం.. LUGER అనేది జర్మనీకి చెందిన 9MM సెమీ ఆటోమేటిక్ పిస్టల్ పేరు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో జర్మన్ సైన్యం ఈ గన్‌ను ప్రామాణిక ఆయుధంగా ఉపయోగించేదని సమాచారం.

డ్రాగన్ సినిమా 1967 కాలంలో జరిగిన అంతర్జాతీయ నల్లమందు స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఎన్టీఆర్ పాత్రకు లూగర్ అనే పవర్‌ఫుల్ పేరు పెట్టి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ పేరుకు సంబంధించిన అసలు అర్థంపై మూవీ టీమ్ ఇంకా అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. డ్రాగన్ ను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, డ్రాగన్ గ్లింప్స్‌తో పాటు లూగర్ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular