నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న భారీ చిత్రం NBK-111 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వీరసింహారెడ్డి తర్వాత ఈ క్రేజీ కాంబో మళ్లీ కలవడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా మూవీ టీమ్ ఒక సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చింది.
వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఆయనను NBK-111 టీమ్‌లోకి స్వాగతించారు. ఈ ప్రకటనతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతుండగా.. మంచు మనోజ్ కూడా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
‘నా పుట్టినరోజు నాకు ఎంతో ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చింది. బాలయ్య అన్నతో కలిసి నటించాలనే నా కల ఇప్పుడు నిజమవుతోంది’ అంటూ మనోజ్ ఆనందం వ్యక్తం చేశారు. అలాగే బాలయ్య, గోపీచంద్ మలినేనిపై తనకున్న గౌరవం గురించి చెబుతూ.. ఈ సినిమా తన కెరీర్లో ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే సినిమాలో మంచు మనోజ్ ఏ పాత్రలో కనిపించబోతున్నారన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉంచారు.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆయన ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మిరాయ్, భైరవం వంటి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించిన మనోజ్.. ఇప్పుడు బాలయ్యకు ప్రత్యర్థిగా కనిపిస్తే స్క్రీన్‌పై భారీ ఎలివేషన్స్ ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.
గతంలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో బాలయ్య కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.






