పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం థియేటర్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబోపై భారీ అంచనాలు ఉండగా, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది.
శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైంది. భారీ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, మొదటి రోజే మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. అదే సమయంలో ధురంధర్-2 భారీ హిట్ కావడంతో ఉస్తాద్ రన్ త్వరగా ముగిసింది.
పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, కథలో బలహీనతలు సినిమా ఫలితాన్ని ప్రభావితం చేశాయి.
ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ Netflix ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
ఏప్రిల్ 16 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ Netflixలో స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్ శ్రీలీల అధికారికంగా వెల్లడించింది. తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసే అవకాశం పొందుతున్నారు.





