HomeMovie News Teluguమా పెళ్లి లవ్ జీహాద్ కాదు.. మోనాలిసా క్లారిటీ!

మా పెళ్లి లవ్ జీహాద్ కాదు.. మోనాలిసా క్లారిటీ!

గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాలో పూసలు అమ్ముతూ తన అందంతో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోసలే తాజాగా వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది. తన ప్రియుడు, నటుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలోని తిరువనంతపురం సమీపంలోని అరుమనూర్ శ్రీ సైనార్ దేవా ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది.

గత ఆరు నెలలుగా ప్రేమలో ఉన్న ఈ జంట, కుటుంబ సభ్యుల అభ్యంతరాలను ఎదుర్కొని చివరకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మోనాలిసా ఇండోర్‌కు చెందినది కాగా, ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నాగమ్మ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారి మధ్య ప్రేమ మొదలైనట్లు సమాచారం.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో ఆలయంలో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పెళ్లిపై దర్శకుడు సనోజ్ మిశ్రా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు పెద్ద చర్చకు దారి తీసింది. ఆయన ఈ వివాహాన్ని ‘లవ్ జీహాద్’గా పేర్కొనడంతో సోషల్ మీడియాలో వివాదం మొదలైంది.

ఈ ఆరోపణలపై మోనాలిసా తాజాగా స్పందించింది. మా పెళ్లిపై ఇలాంటి ముద్రలు వేయకండి. నేను పూర్తిగా నా ఇష్టంతో, మనస్ఫూర్తిగా హిందూ ఆచారాల ప్రకారం ఆలయంలో వివాహం చేసుకున్నాను. మాకు అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉంది. ఒక మేజర్‌గా నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు నాకు ఉంది” అని ఆమె స్పష్టం చేసింది.

అదేవిధంగా తాము ఎవరూ మతం మార్చుకోలేదని ఫర్మాన్ ఖాన్ కూడా తెలిపారు. ప్రేమలో మత మార్పిడి అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

మోనాలిసా మైనర్ అని వస్తున్న ప్రచారాన్ని కూడా ఆమె ఖండించింది. తన ఆధార్ కార్డు, జనన సర్టిఫికెట్‌ను మీడియాకు చూపిస్తూ తాను మేజర్ అని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేరళ ప్రభుత్వ K-SMART యాప్ ద్వారా తమ వివాహాన్ని చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకున్నట్లు వెల్లడించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular