HomeMovie News Teluguబికినీ ట్రాలింగ్‌.. హాట్‌ బ్యూటీ పరేషాన్‌

బికినీ ట్రాలింగ్‌.. హాట్‌ బ్యూటీ పరేషాన్‌

పెళ్ళయ్యాక సినిమాలకు గుడ్‌ బై చెప్పాల్సిన అవసరం లేదని చాలామంది తారలు నిరూపించారు. తల్లయ్యాక కూడా హాట్‌ హాట్‌గా కన్పించడం తప్పు లేదని ఇంకొందరు నిరూపించారు. ఆ లిస్ట్‌లోకి బాలీవుడ్‌ బ్యూటీ కరీనాకపూర్‌ కూడా చేరిపోయింది ఎప్పుడో. 

లేటెస్ట్‌గా కరీనాకపూర్‌ బికినీ ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. చాలా విమర్శలూ, వివాదాలూ పుట్టుకొస్తున్నాయి. తన బికినీ ఫొటోలపై జరుగుతున్న ట్రాలింగ్‌ని లైట్‌ తీసుకుంది కరీనాకపూర్‌. స్విమ్మింగ్‌ పూల్‌లోకి బికినీతో కాక, ఇంకెలా దిగుతాం? అని ప్రశ్నించింది కరీనాకపూర్‌. తన భర్త సైఫ్‌ అలీఖాన్‌, కుమారుడు తైమూర్‌ మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తోంది హాలీడే ట్రిప్‌ని ఈ అందాల భామ. ఆ ఎంజాయ్‌మెంట్‌ తాలూకు ఫొటోలే ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. 

ఎవరేమనుకున్నా డోన్ట్‌ కేర్‌ అనేసిన కరీనాకపూర్‌, పనిలేనోళ్ళు.. నా ఫొటోలతో పబ్లిసిటీ చేసుకోవాలనుకునేవాళ్ళు సృష్టించే వివాదాలకీ, ట్రాలింగ్‌కీ సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదని క్లారిటీ ఇచ్చేసింది ఈ బాలీవుడ్‌ బ్యూటీ. ‘అప్‌డేట్‌ అవ్వండి.. ఎడ్యుకేట్‌ అవ్వండి..’ అంటూ ట్రాలింగ్‌ చేసేవారికి కరీనా ఉచిత సలహా కూడా ఇచ్చేసింది. 

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. బికినీలో కరీనా కెవ్వు కేక అంతే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular