HomeMovie News Teluguబాబోయ్‌ ఈ ముద్దుల గోలేంటీ.?

బాబోయ్‌ ఈ ముద్దుల గోలేంటీ.?

ఒకప్పుడు బాలీవుడ్‌లో ముద్దు సీన్ల గురించి అందరూ చర్చించుకునేవారు. కానీ ట్రెండ్‌ మారింది కదా. ఆ చర్చా వేదికలు మన టాలీవుడ్‌లో మొదలయ్యాయి. అండ్‌ అఫ్‌కోర్స్‌ బాలీవుడ్‌ని ఆ విషయంలో మన తెలుగు సినిమా ఎప్పుడో దాటేసింది. ఇప్పుడు సరికొత్త ప్రయోగాల దిశగా తెలుగు సినిమా ముద్దు సీన్లలో ముందుందనే చెప్పాలి. 

సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ మొదలుకొని ఈ మధ్య వచ్చిన చాలా చిన్న సినిమాలు ఈ ముద్దు సీన్లతోనే సెన్సేషనల్‌ విజయం అందుకున్నాయి. ఇక తెలుగు సినిమా సంగతిటుంచితే, తాజాగా ఓ బాలీవుడ్‌ చిత్రం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది ముద్దు సీన్లలో. ‘తూనీగా తూనీగా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన రియా చక్రవర్తి నటించిన హిందీ సినిమా ‘జలేబీ’ నుండి కొన్ని పోస్టర్స్‌ విడుదలయ్యాయి. 

ఆ పోస్టర్స్‌ ఏంటంటారా? ముద్దు సీన్లే. మామూలు ముద్దులు కాదండోయ్‌. ట్రైన్‌ కిటికీలోంచి హీరోయిన్‌ని బయటికి లాగి, హీరో లిప్‌లాక్‌ చేస్తున్నాడు. అలాగే హీరోని కిటికీలోంచి బయటికి లాగి, హీరోయిన్‌ కూడా సేమ్‌ ముద్దు సీన్‌ రిపీట్‌ చేస్తోంది. అదీ పోస్టర్స్‌ కథ. ఇప్పుడీ ముద్దు పోస్టర్స్‌ వైరల్‌ అయ్యాయి. ఈ ఫోటోలు చూసి బాబోయ్‌ ఈ ముద్దుల గోలేంటి.? అనుకోకుండా ఉండగలమా మరి. అదీ సంగతి.

అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది. మహేష్‌భట్‌ నిర్మాణంలో, పశుదీప్‌ భరద్వాజ్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వరుణ్‌ మిత్ర, రియా చక్రవర్తి జంటగా నటిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular