HomeMovie News Teluguఈ 'నాటకం'లో అన్నీ ఎక్కువే.!

ఈ ‘నాటకం’లో అన్నీ ఎక్కువే.!

టాలీవుడ్‌ చిన్న సినిమా ఈక్వేషన్స్‌ మారిపోయాయి. హిట్‌ ఫార్ములాని పక్కాగా ఫాలో అయిపోతున్నాయి చిన్న సినిమాలిప్పుడు. చిన్న సినిమాల హిట్‌ ఫార్ములా అంటే జస్ట్‌ లవ్‌స్టోరీనే. కానీ విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందిస్తున్నారు. అంతేనా.. అసలు సిసలు రొమాంటిక్‌ సీన్స్‌కి బాగా మసాలా దట్టించేస్తున్నారు. ఆ మసాలా ఫ్లేవర్‌తోనే అందర్నీ ధియేటర్స్‌కి ఎట్రాక్ట్‌ చేస్తున్నారు. అదే ఫార్ములాతో ఈ మధ్య చాలా సినిమాలు హిట్‌ అయిపోయాయి. 

ఆ కోవలో మొదటగా చెప్పుకోవల్సింది ‘ఆర్‌ఎక్స్‌ 100’. అచ్చం ఇప్పుడదే సినిమాని తలపించేలా మరో సినిమా రాబోతోంది. అదే ‘నాటకం’. రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’ టైటిల్‌ని తలపించేలా ఈ టైటిల్‌ని రూపొందించారు. హీరో గెటప్‌, క్యారెక్టరైజేషన్‌ కూడా కొంచెం అదే తరహాలో డిజైన్‌ చేశారు. ఇక హీరోయిన్‌ సంగతంటారా? సేమ్‌ ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌కి ఏమాత్రం తీసిపోదు. కొంచెం ఎక్కువే కానీ, అస్సలు తక్కువ కాదు అన్నట్లుగా ఉంది. 

ఆశిష్‌ గాంధీ, ఆషిమా నర్వాల్‌ జంటగా తెరకెక్కుతోన్న ఈ ‘నాటకం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నది కళ్యాణ్‌జీ గోగన. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో తెలీదు కానీ, ఇప్పుడయితే ఈ సినిమా టీజర్‌ ఇప్పుడు టాలీవుడ్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. శృతి మించిన రొమాంటిక్‌ సీన్స్‌, బీభత్సమైన యాక్షన్‌ సీన్లు, అన్నీ వెరసి ఆకట్టుకునే పల్లెటూరి వాతావరణం ఇలా ఈ నాటకం టీజర్‌ని చాలా బాగా కట్‌ చేశారు. 

అయితే సినిమా ‘ఆర్‌ఎక్స్‌100’ రేంజ్‌లో హిట్‌ కొడుతుందో లేదో చూడాలి మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular