HomeMovie News Teluguఅమలాపాల్‌ ఇది నువ్వేనా?

అమలాపాల్‌ ఇది నువ్వేనా?

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ ఓ కొత్త గెటప్‌లో దర్శనమిచ్చింది. తమిళంలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడాయి’లోనిది ఈ గెటప్‌. తాజాగా ఈ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. రత్న డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని ఈ ఫస్ట్‌లుక్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. సినిమా డీటెయిల్స్‌ ఏంటనే సంగతి పక్కన పెడితే, అమలాపాల్‌ గెటప్‌ గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. 

ఈ లుక్‌లో ఓ డిఫరెంట్‌ కాస్ట్యూమ్‌లో అమలాపాల్‌ కనిపిస్తోంది. చేతిలో ఓ కర్రతో, శరీరంపై అక్కడక్కడా గాయాలతో బాధగా రోధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె చుట్టూ రక్తం ఏరులా పారుతోంది. ఎక్స్‌ప్రెషన్‌లో భావోద్వేగం కనిపిస్తున్నా, అప్పియరెన్స్‌లో చాలా హాట్‌నెస్‌ కనిపిస్తోంది. ఇంచుమించు బికినీలాంటి కాస్ట్యూమ్‌లో అమలాపాల్‌ ఎక్స్‌పోజింగ్‌ చేస్తోంది. అయితే ఎందుకు అమలాపాల్‌ అలా రోదిస్తోంది. కసితో నిండిన చూపులతో బాధతో నిండిన మనసుతో ఎవరి మీదో ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో కనిపిస్తోంది. ఇన్ని భావోద్వేగాలున్నాయి కాబట్టి, ఈ లుక్‌కి వస్తున్న రెస్పాన్స్‌ అదిరిపోతోంది. 

అమలాపాల్‌ మంచి నటి. తెలుగులోనూ రెండు మూడు సినిమాల్లో నటించింది. ఇక తమిళ, మలయాళంలో వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్లిపోతోంది. వివాహ బంధాన్ని రద్దు చేసుకున్నాక, కెరీర్‌లో ఫుల్‌ జోష్‌ ప్రదర్శిస్తోంది. మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంటోంది. ఎక్కువగా హీరోయిన్‌ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటోంది. చూడాలి మరి ఈ ‘ఆడాయి’ సినిమాతో అమలాపాల్‌ ఏ మాయ చేయబోతుందో.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular