HomeMovie News Teluguతెలుగందమే కానీ.. ఆ విషయంలో సో హాట్‌ గురూ.!

తెలుగందమే కానీ.. ఆ విషయంలో సో హాట్‌ గురూ.!

సాధారణంగా తెలుగమ్మాయిలు గ్లామర్‌కు దూరంగా ఉంటారు అనేది ఇంతవరకూ మనందరికీ తెలిసిన విషయమే. టాలెంట్‌ ఉంటుంది. కానీ గ్లామర్‌కి నో అనడంతోనే తెలుగులో తెలుగమ్మాయిలకు అంతగా ఆదరణ దక్కడం లేదు అనే వాదన వినిపిస్తోంది. 

అయితే తాజాగా హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్న తెలుగమ్మాయి ‘శోభితా ధూళిపాళ్ల’ మాత్రం ఆ వాదన తప్పని నిరూపించేసింది. అందాల పోటీ నుండి వచ్చిన ఈ ముద్దుగుమ్మ హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అనే రేంజ్‌లో అందాలారబోసేస్తోంది. తొలి సినిమా ‘గూఢచారి’లోనే గ్లామర్‌ కంచెలు తెంచేసిందీ హాట్‌ బ్యూటీ. 

అంతేనా. సినిమా సంగతి అటుంచితే, సోషల్‌ మీడియా వేదికగా ఈ బ్యూటీ చేస్తున్న హాట్‌ హాట్‌ హల్‌ చల్‌ అంతా ఇంతా కాదు. టాప్‌ మోస్ట్‌ బాలీవుడ్‌ హీరోయిన్స్‌కి మించిన స్థాయిలో అందాలారబోసేస్తూ ఫోటోలకు పోజిచ్చేస్తోంది. ఆ హాట్‌ పిక్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేసి, ఇప్పటికే బోలెడంత క్రేజ్‌ సంపాదించేసింది. 

ఇక ‘గూఢచారి’ సినిమా విషయానికి వస్తే, హాలీవుడ్‌ రేంజ్‌ మేకింగ్‌లా కనిపిస్తోంది ఈ సినిమా. హాలీవుడ్‌ సినిమాలంటే హాట్‌ హాట్‌ సీన్స్‌కీ ఎక్కువ ప్రాధాన్యతే ఉంటుంది. ఆల్రెడీ ఆ సీన్స్‌ ఎలా ఉండబోతున్నాయనే సంకేతాలు టీజర్‌ ద్వారానే పంపించేసింది చిత్ర యూనిట్‌. ఒకవేళ తొలి సినిమా హిట్‌ అయ్యిందా? ఇక అంతే సంగతి, మన తెలుగమ్మాయిని పట్టుకోవడం అంత వీజీ ఏమీ కాదనిపిస్తోంది. చెలరేగిపోతుందంతే.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular