HomeMovie News Teluguసినిమాలకి గుడ్ బై చెప్పేస్తున్న సమంత..?

సినిమాలకి గుడ్ బై చెప్పేస్తున్న సమంత..?

అక్కినేని వారి కోడలయ్యాక సమంత సరికొత్త కథలను ఎంచుకోవడమే కాకుండా, మంచి విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటోంది. ఈ సంగతి అటుంచితే, పెళ్లయ్యింది కదా, మరి పిల్లల సంగతేంటనీ, సమంతను ఓ ఇంటర్వ్యూలో ఆడగ్గా, పిల్లల కోసం చైతూ నేను ఓ టైం అనుకున్నాం. ఆ టైం వచ్చే వరకూ కెరీర్‌ పైనే పూర్తిగా దృష్టి పెడతామని సమంత గతంలో చెప్పింది. 

అయితే ఇప్పుడా టైం వచ్చేసిందా? అంటే అవునంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. సమంత వచ్చే ఏడాదిని అందుకు సరైన టైంగా భావించిందనీ, సో వచ్చే ఏడాది నుండి సమంత ఇక సినిమాల్లో నటించదనీ, పూర్తిగా ఫ్యామిలీ కోసమే కేటాయిస్తుందనీ ఈ పుకార్ల సారాంశం. అయితే ఈ విషయంలో సమంత ఇంకా స్పందించలేదు. 

ప్రస్తుతం సమంత ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ‘యూ టర్న్‌’ రీమేక్‌లో నటిస్తోంది. ఇవే కాక భర్త నాగచైతన్యతో పెళ్లి తర్వాత తొలి సారిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఓ లవ్‌ స్టోరీలో సమంత, చైతూ జత కడుతున్నారు. ఇలా చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సమంత ఇలాంటి షాకింగ్‌ నిర్ణయం తీసుకుంటుందా? 

సమంత నుండి రెస్పాన్స్‌ వస్తే కానీ తెలీదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular