HomeMovie News Teluguబిగ్‌ బాస్‌ - నాని 'చిన్నోడు' ఏమీ కాదండోయ్‌!

బిగ్‌ బాస్‌ – నాని ‘చిన్నోడు’ ఏమీ కాదండోయ్‌!

పెద్ద పెద్ద స్టార్లు హోస్ట్‌గా వ్యవహరించారు ‘బిగ్‌ బాస్‌’ రియాల్టీ షో కోసం. బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌, కోలీవుడ్‌లో కమల్‌హాసన్‌, తెలుగులో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘బిగ్‌ బాస్‌’ రియాల్టీ షోకి సరికొత్త గ్లామర్‌ తీసుకొచ్చారు. తెలుగులో ‘బిగ్‌ బాస్‌’ రియాల్టీ షో రెండో సీజన్‌ కోసం నేచురల్‌ స్టార్‌ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 

ఇది నిజంగానే షాకింగ్‌ విషయం. నాని స్టార్‌డమ్‌, బిగ్‌ బాస్‌ రియాల్టీ షోకి సరిపోదేమో.. అన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. నాని మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా కన్పిస్తున్నాడు. ‘షో’ కోసం ఏం చేయాలో, అంతా చేయడానికి నాని సిద్ధమవుతున్నాడట. నానిలో మంచి టైమింగ్‌ వుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ టైమింగే తనకు పెద్ద ప్లస్‌ పాయింట్‌ అని చెబుతున్నాడు. ఎంటర్‌టైనింగ్‌ వేలో షోని నడిపించడంతోపాటు, ఆ షోకి కావాల్సినంత హుందాతాన్ని ఇవ్వాల్సి వుంటుందనే విషయం నానికి కూడా బాగా తెలుసు. 

‘బిగ్‌ బాస్‌’ రియాల్టీ షో ఒప్పుకోవడానికి ముందే, అన్ని విధాలా ఆలోచించి, ఆ రియాల్టీ షో గురించి తెలుసుకుని రంగంలోకి దిగాడు. పైకి మాత్రం, ‘అంతా కొత్త కొత్తగానే వుంది’ అని చెబుతున్నా, ‘బిగ్‌ బాస్‌’ రియాల్టీ షోకి తనవైపు నుంచి ఎంత ఔట్‌ పుట్‌ ఇవ్వాలో అదంతా రెడీ చేసేసుకున్నాడు నాని. ఫస్ట్‌ డే, ఫస్ట్‌ ఈవెంట్‌తోనే నాని తానేంటో నిరూపించుకోబోతున్నాడట. డాన్సులు, కామెడీ.. ఇలా చాలానే వుండబోతున్నాయట. 

అయితే పార్టిసిపెంట్లు, నానితో ఎలా వుంటారు? అన్నదే కీలకం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular