HomeMovie News Telugu'కాలా' రజనీకాంత్‌ని మార్చేసింది.!

‘కాలా’ రజనీకాంత్‌ని మార్చేసింది.!

తన సినిమాల గురించి రజనీకాంత్‌ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే, రజనీకాంత్‌ సూపర్‌ స్టార్‌. తన సినిమాలే మాట్లాడాలని అనుకునే వ్యక్తి ఆయన. రజనీకాంత్‌ నుంచి ఏ సినిమా వచ్చినా, ఆ సినిమాకి ప్రీ రిలీజ్‌ హైప్‌ ఆకాశాన్నంటేలా వుంటుంది. ఫ్లాపులతో సంబంధం లేని హీరోగా రజనీకాంత్‌ గురించి చెప్పుకోవచ్చు. 

అయితే, ఇటీవలి కాలంలో వచ్చిన వరుస ఫ్లాపులతో రజనీకాంత్‌ వెలుగులు బాక్సాఫీస్‌ వద్ద తగ్గిపోయాయి. అన్నీ అనుకున్నట్టు జరిగి వుంటే రజనీకాంత్‌ ఈపాటికి ‘2.0’ సినిమాతో మళ్ళీ కింగ్‌ ఆఫ్‌ బాక్సాఫీస్‌ అన్పించుకునేవాడే. కానీ, ‘2.0’ వెనక్కి వెళ్ళి, ఆ ప్లేస్‌లోకి కాస్త లేటుగా అయినా ‘కాలా’ వచ్చి చేరింది. ఇప్పుడు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. దాంతో, ‘కాలా’ ప్రమోషన్‌ కోసం రజనీకాంత్‌ శ్రమించాల్సి వస్తోంది. తెలుగు ఆడియన్స్‌ని ‘కాలా’ వైపుకు అట్రాక్ట్‌ చేసేందుకు రజనీకాంత్‌ ప్రయత్నిస్తున్నాడు. 

‘కాలా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం హైద్రాబాద్‌కి వచ్చిన రజనీకాంత్‌, తెలుగు ఆడియన్స్‌ మీద ప్రశంసల జల్లు కురిపించేశాడు. తెలుగు మీడియానీ ఎట్రాక్ట్‌ చేసేశాడు. ఈ క్రమంలో రజనీకాంత్‌ తన ‘కబాలి’ కూడా హిట్టేనని చెప్పుకున్నాడు. తన అల్లుడు ధనుష్‌ నిర్మించిన ‘కాలా’ పెద్ద విజయం సాధిస్తుందని చెప్పాడు. రజనీకాంత్‌ ఇలా మాట్లాడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే స్టార్‌ అయి వుండీ, తన సినిమా ప్రమోషన్‌ కోసం ఇంతలా కష్టపడ్తున్న రజనీకాంత్‌ని అభినందించి తీరాల్సిందే.  

రజనీకాంత్‌ కష్టం ఫలించి ‘కాలా’ సినిమా విజయం సాధిస్తే మంచిదేగానీ, ఆ స్థాయిలో ‘కాలా’ సినిమాపై అంచనాలేవీ కన్పించకపోవడం గమనార్హం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular