HomeMovie News Teluguనాని అదరగొట్టడానికి రెడీ అవుతున్నాడు..!

నాని అదరగొట్టడానికి రెడీ అవుతున్నాడు..!

బుల్లితెరపై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ప్రసారమైన మెగా గేమ్‌ షో ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 1 ఎంతగా పాపులర్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తనదైన నటనతో సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌తో బుల్లితెర ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు ఈ షో ద్వారా. వీకెండ్‌లో రెండ్రోజులు మాత్రమే కనిపించినా ఎన్టీఆర్‌ ప్రభావం వీక్‌ మొత్తం ఉండేది. వీకెండ్‌లో ఎన్టీఆర్‌ కోసం ప్రేక్షకులంతా తమ తమ పనులకు స్వస్థి చెప్పేసి టీవీల ముందు వాలిపోయేవారు. అలా బిగ్‌బాస్‌ షో బుల్లితెర ప్రేక్షకులను 72 రోజుల పాటు విశేషంగా అలరించింది. ఇప్పుడు ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 స్టార్ట్‌ అవుతోంది. 

ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించేదెవరు? అంటూ గత కొన్ని రోజులుగా పలువురు పేర్లు పరిశీలిస్తూన్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. అయితే వారిలో నేచురల్‌ స్టార్‌ నాని పేరు దాదాపు ఖరారైనట్లుగా తాజా సమాచారమ్‌ అందుతోంది. నాలుగు కోట్ల డీల్‌తో నానిని బిగ్‌బాస్‌కి హోస్ట్‌గా ఎంచుకున్నారనీ తెలుస్తోంది. పెద్దతెరపై నాని తడాఖా సంగతి తెలిసిందే. తనదైన నేచురల్‌ నటనతో వరుస విజయాలతో దూకుడు మీదున్నాడిప్పుడు నాని. 

నానిని అందరూ తమ ఇంట్లో అబ్బాయి, పక్కింటి అబ్బాయిగా భావిస్తుంటారు. అలాంటి ఈ అబ్బాయి బిగ్‌బాస్‌ ద్వారా బుల్లితెరపై కనిపిస్తాడంటే ఆడియన్స్‌కి పండగే కదా. ఇటీవలే ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని, ప్రస్తుతం నాగార్జునతో మల్టీ స్టారర్‌లో నటిస్తున్నాడు. నాని తన నేచురల్‌ నటనతో బుల్లితెర బిగ్‌బాస్‌గా ఎన్టీఆర్‌ని మ్యాచ్‌ చేస్తాడో లేక డామినేట్‌ చేస్తాడో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular