HomeMovie News Teluguమహేష్‌ అలా సపోర్ట్‌ ఇచ్చాడన్న మాట!

మహేష్‌ అలా సపోర్ట్‌ ఇచ్చాడన్న మాట!

శ్రీరెడ్డి ఇష్యలో కొన్ని తెలుగు మీడియా ఛానెల్స్‌ చూపించిన అత్యుత్సాహంపై పవన్‌ విమర్శలు గుప్పిస్తూ నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూకి సంబంధించి పవన్‌ కళ్యాణ్‌కి సినీ ఇండస్ట్రీ తరపు నుండి భారీగా మద్దతు లభిస్తోంది. సదరు న్యూస్‌ ఛానెల్స్‌పై పవన్‌ ట్విట్టర్‌ వేదికగా చేసిన వ్యాఖ్యలకు ఆయా మీడియా ఛానెల్స్‌ రీ కౌంటర్స్‌ ఇస్తూ ఫైర్‌ అవుతున్నాయి. 

ఈ సంగతిటుంచితే, మరో పక్క సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుత పరిణామాలకు తగ్గట్లుగా ఈ సినిమాలో మహేష్‌బాబు చెప్పిన డైలాగులున్నాయంటున్నారు అభిమానులు. ముఖ్యంగా ఓ ప్రెస్‌ మీట్‌లో మహేష్‌బాబు మీడియాని దుమ్ము దులిపేసిన సన్నివేశాలు సినిమాకి హైలైట్‌గా నిలవడంతో పాటు, పవన్‌ నిరసనకి పరోక్షంగా సపోర్ట్‌ ఇచ్చినట్లున్నాయని అంటున్నారు. 

కొరటాల శివ, మహేష్‌బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి, అంచనాలను అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. ముఖ్యమంత్రి పాత్రలో సూపర్‌స్టార్‌ దుమ్ము దులిపేస్తున్నాడు. కలెక్షన్స్‌ జోరు చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మహేష్‌ ‘భరత్‌ అనే నేను’ సినిమా ఓవర్సీస్‌లోనూ దూకుడు మీదుంది. 

తాజాగా ఈ సినిమాని చూసిన దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా ప్రెస్‌ మీట్‌ సన్నివేశం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉందనీ భరత్‌ టీమ్‌ మొత్తానికి కంగ్రాట్స్‌ తెలిపారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular