HomeMovie News Teluguదయచేసి నన్ను క్షమించండి: శ్రీ రెడ్డి

దయచేసి నన్ను క్షమించండి: శ్రీ రెడ్డి

తనకి ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తామంటూ తనని శారీరకంగా వాడుకున్నారు అని గత కొన్నిరోజులుగా మీడియాతో సదరు వివరాలు చెబుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

అయితే పరిణామ క్రమంలో మొన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశ్యించి అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. దీనికి కారణం ఆయన ఇటువంటి సమస్యలు ఉన్నవారు మీడియాకి వెళ్ళడం కన్నా పోలిసుల వద్దకి వెళితేనే సమంజసంగా సమస్య పరిష్కారానికి కూడా అవకాశం ఉంటుంది అని సలహా ఇవ్వడమే అని తెలిసింది.

కాకపోతే పవన్ కళ్యాణ్ పైన శ్రీ రెడ్డి చేసిన తీవ్ర దుమారం సృష్టించడంతో పవన్ ఫ్యాన్స్ అలాగే పలువురు సెలబ్రిటీలు ఈ అంశంలో శ్రీ రెడ్డి చేసింది ముమ్మాటికి తప్పే అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక ఈ సందర్భంగా శ్రీ రెడ్డి తన సోషల్ మీడియా ఎకౌంటు అయిన ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ తల్లిని ఉద్దేశ్యించి పదజాలం వాడినందుకు క్షమాపణలు చెబుతూ ఒక ట్వీట్ చేసింది.

ఇదే ఆమె చేసిన ట్వీట్- పవన్ కళ్యాణ్ అమ్మ గారికి నేను మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నాను నేను కావాలని చేయలేదు కానీ నేను చేసింది ముమ్మాటికి తప్పే అందుకే క్షమించమని కోరుకుంటున్నాను.

You May Like This
- Advertisment -spot_img

Most Popular