HomeMovie News Telugu'భరత్‌' అనే సంచలనానికి సర్వం సిద్ధం

‘భరత్‌’ అనే సంచలనానికి సర్వం సిద్ధం

ఇప్పుడు ఎక్కడ చూసినా భరత్‌ మేనియానే కన్పిస్తోంది. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది మహేష్‌బాబు నటిస్తున్న ‘భరత్‌ అనే నేను’ చిత్రం. దాంతో, ముందుగానే అభిమానులు ధియేటర్స్‌ అన్నీ డెకరేట్‌ చేసేశారు. భారీ కటౌట్స్‌తో ధియేటర్స్‌ ముందు పండగ వాతావరణం సృష్టించేశారు. ఇంతకు ముందు మహేష్‌ నటించిన ఏ సినిమాకీ లేనంత భారీ హంగామా ఈ సినిమా విషయంలో చేస్తున్నారు. ఈ సినిమాని అభిమానులు ప్రెస్టీజియస్‌ ఇష్యూగా తీసుకున్నారు. 

మరోపక్క చిత్ర నిర్మాత కూడా సినిమా ప్రమోషన్స్‌ని భారీగా ప్లాన్‌ చేశారు. చిత్ర యూనిట్‌ చేసే ప్రమోషన్‌ ఒకెత్తు అయితే, అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా, ఇతరత్రా పలు ఇన్నోవేటివ్‌ థాట్స్‌ ద్వారా పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌ చేస్తున్నారు. మరోపక్క ‘స్పైడర్‌’ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో తమిళనాడులో కూడా మహేష్‌బాబు అభిమానులు సందడి చేస్తున్నారు. అక్కడ ‘భరత్‌ అనే నేను’ విడుదలయ్యే ధియేటర్స్‌ వద్ద పెద్ద ఎత్తున ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఇటు తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్‌ వరకూ టికెట్స్‌ హౌస్‌ఫుల్స్‌ అయిపోయాయి. ఏపీలో ‘భరత్‌’ కోసం ఎక్స్‌ట్రా షోస్‌ వేసేందుకు అక్కడి గవర్నమెంట్‌ అనుమతి మంజూరు చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular