HomeMovie News Telugu'అర్జున్‌రెడ్డి'కి ఫిదా అయిన 'భరత్‌' బ్యూటీ

‘అర్జున్‌రెడ్డి’కి ఫిదా అయిన ‘భరత్‌’ బ్యూటీ

‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతున్న బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కైరా అద్వానీ. 

ఈ బ్యూటీకి ఈ మధ్య కాలంలో తాను చూసిన సినిమాల్లో ‘అర్జున్‌రెడ్డి’ సినిమా బాగా నచ్చిందట. ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది ‘అర్జున్‌రెడ్డి’, అందులో నటించిన హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ షాలినీ పాండే చాలా చక్కగా నటించారు. నేచురల్‌గా అనిపించింది అంటూ ‘అర్జున్‌రెడ్డి’ సినిమాపై పొగడ్తల జల్లు కురిపించింది కైరా అద్వానీ. 

ఇకపోతే, ఈ బ్యూటీ నటిస్తోన్న ‘భరత్‌ అనే నేను’ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటోందీ బ్యూటీ. ఈ సినిమా చేస్తున్నప్పుడే మహేష్‌ నుండి ఓ ప్రామిస్‌ తీసుకుందట కైరా అద్వానీ. మరోసారి మనిద్దరం కలిసి పని చేద్దాం అని మాటిచ్చాడట సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు. ఆ ప్రామిస్‌ తనకెంతో విలువైందని మురిసిపోతోంది. 

చరణ్‌ డాన్సులంటే తనకెంతో ఇష్టమట. చరణ్‌ గురించి ఇప్పటికే చాలా విన్నాననీ, ఆయనతో కలిసి పని చేయాలని, కలిసి డాన్సులు చేయాలని ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నానని చెబుతోంది కైరా అద్వానీ. బోయపాటి శీను, రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో కైరా హీరోయిన్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘రాజ వంశస్థుడు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఇటీవలే ‘రంగస్థలం’ సినిమాతో రికార్డు హిట్‌ అందుకున్న రామ్‌చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శీను సినిమా కోసం సన్నద్దమవుతున్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular