HomeMovie News Teluguనిహారిక వాలెంటైన్స్ డే స్పెషల్

నిహారిక వాలెంటైన్స్ డే స్పెషల్

మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలుగా తెరంగేట్రం చేశారు. కానీ హీరోయిన్సే లేరింతవరకూ. అయితే ఆ ఒకే ఒక్క లోటు నిహారిక ద్వారా తీరిపోయింది. నవ్వుల రారాజు నాగబాబు కుమార్తై నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో గ్రాండ్‌గా తెలుగు తెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తొలి సినిమా నిరాశ పరిచింది. బరువైన పాత్రని ఎంచుకోవడంతో ఆ సినిమా నిహారికకు కలిసి రాలేదు.

కానీ ఈ సారి మాత్రం నిహారిక నవ్వుల నాగబాబు కూతురుగా అదే ట్రెండ్‌ కంటిన్యూ చేయడానికి, నవ్వులు పంచేందుకే వచ్చేస్తోంది. ‘హ్యాపీ వెడ్డింగ్‌’ సినిమాతో ఈ మెగా అల్లరి పిల్ల నిహారిక సెకండ్‌ ఎంట్రీ ఇస్తోంది. యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ ఈ సినిమాలో నిహారికతో జోడీ కడుతున్నాడు. తొలి సినిమా ‘ఒక మనసు’లో డల్‌ క్యారెక్టర్‌ పోషించిన నిహారిక, ఇక నుండి అన్నీ జోష్‌ ఉన్న క్యారెక్టర్స్‌నే ఎంచుకోనుందట. అందుకు తగ్గ కథల్నే వింటోందట. కూల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గానే తెరకెక్కుతోన్న నిహారిక తాజా చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ బ్యాక్‌ గ్రౌండ్‌తో పాకెట్‌ సినీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్నారు. 

సైలెంట్‌గా ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. లవర్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 14న ‘హ్యాపీ వెడ్డింగ్‌’ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కానుంది. ఈ సినిమాలో నిహారిక ఎలా ఉండబోతోందంటూ మెగా అభిమానులు ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. మరో పక్క ఇటీవలే నిహారిక ఓ తమిళ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో నిహారిక ఓ ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్‌ని పోషించింది. గెటప్‌ కూడా సరికొత్తగా ఉంది. విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular