HomeMovie News Telugu'తొలిప్రేమ' పై పొగడ్తల వర్షం కురిపించిన రాజమౌళి

‘తొలిప్రేమ’ పై పొగడ్తల వర్షం కురిపించిన రాజమౌళి

చిన్న సినిమాలను మెచ్చుకోవడంలో ఈ మధ్య రాజమౌళి ముందుంటున్నారు. గతేడాది ది బెస్ట్‌ ఫిల్మ్‌ అంటూ ‘అర్జున్‌రెెడ్డి’ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తేశాడు. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిందీ చిత్రం. అలాగే తాజాగా రాజమౌళి దృష్టిని ఆకర్షించిన మరో చిత్రం ‘తొలిప్రేమ’. 

మెగా ప్రిన్స్‌, రాశీఖన్నా జంటగా తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమిది. వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి అంటేనే లవ్‌ మంత్‌. లవ్‌ మంత్‌లో ది బెస్ట్‌ లవ్‌స్టోరీగా విడుదలైన ఈ చిత్రం లవర్స్‌నే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తోంది. ఇప్పుడు మరో బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఈ సినిమాకి దక్కింది. ‘బాహుబలి’తో యూనివర్సల్‌ డైరెక్టర్‌గా ఖ్యాతి పొందిన రాజమౌళిని ఈ సినిమా బాగా ఇంప్రెస్‌ చేసిందట. తనకి లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించడం రాదంటూ రాజమౌళి చెబుతూ, ఈ సినిమా ఫీల్‌ని తానెంతగానో ఆస్వాదిస్తున్నాననీ ఆయన చెప్పడం విశేషం. 

గతంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘తొలిప్రేమ’ క్రియేట్‌ చేసిన ఫీల్‌ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ ఫీల్‌కీ, ఆ టైటిల్‌కీ ఏమాత్రం డ్యామేజ్‌ కాకుండా, యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ఇప్పటి ‘తొలిప్రేమ’ని తెరకెక్కించారు. కథ పాతదే అయినా కానీ, ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా ఆయన చూపించిన కధనం అందర్నీ ఆకట్టుకునేలా ఉండడంతో సినిమా విజయం దిశగా దూసుకెళ్లిపోతోంది. ‘ఫిదా’ తర్వాత మరో సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాతో. ముద్దుగుమ్మ రాశీఖన్నాకి ఈ సినిమా కెరీర్‌ బెస్ట్‌ మూవీ అని చెప్పొచ్చు. 

అందుకే ఈ చిత్రం విషయంలో ది గ్రేట్‌ రాజమౌళి అంతగా స్పందించారు. మంచి నిర్మాణ విలువలతో, అన్ని విధాల విజయానికి అర్హత ఉన్న సినిమా ‘తొలిప్రేమ’ అని రాజమౌళి బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చారు ఈ సినిమాకి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular