HomeMovie News Teluguరకుల్‌ - అందాల విందు జిగేల్‌ జిగేల్‌!

రకుల్‌ – అందాల విందు జిగేల్‌ జిగేల్‌!

సోషల్‌ మీడియాలో రకుల్‌ గ్లామర్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘మేగ్జిమ్‌’ కవర్‌ పేజీపై రకుల్‌ తళుకులతో మెరిసిపోవడమే దీనికి కారణం. ఇదిగో ‘మేగ్జిమ్‌’ ఫొటో సెషన్‌లో తాజా స్టిల్‌ ఇది. బికినీని తలదన్నే గ్లామర్‌తో హల్‌చల్‌ చేస్తోన్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఈ ఫొటోలోనూ తళుక్కుమనే గ్లామర్‌తో కిర్రాకు పుట్టించేస్తోంది. 

తెలుగులో అవకాశాలు తగ్గినా, బాలీవుడ్‌తోపాటు తమిళ సినిమాల్లోనూ అవకాశాలు పోటెత్తుతున్నాయి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి. తన తాజా బాలీవుడ్‌ సినిమా ‘అయ్యారీ’ ప్రమోషన్‌ కోసం సోషల్‌ మీడియాని హీటెక్కించేస్తోన్న రకుల్‌, పనిలో పనిగా తన గ్లామర్‌లోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ టాలీవుడ్‌నీ సరికొత్తగా ఎట్రాక్ట్‌ చేసేస్తోంది. త్వరలో ఓ ప్రెస్టీజియస్‌ మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని సరికొత్తగా పలకరించబోతున్నానని చెబుతోన్న రకుల్‌, సౌత్‌తో పోల్చితే బాలీవుడ్‌లో సినిమాల నిర్మాణం కొంత నెమ్మదిగా జరుగుతుందనీ, వాటి ప్రమోషన్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని చెప్పింది. 

బాలీవుడ్‌కి రీచ్‌ ఎక్కువ ఉన్నా, ఈ ఒక్కటీ కొంత ఇబ్బందికరమైన విషయమని ఆమె అభిప్రాయపడింది. నిజమే, తెలుగులో ఆ ఇబ్బంది వుండదు. ఓ హీరోయిన్‌ ఏకకాలంలో నాలుగైదు సినిమాలకు కమిట్‌ అయిపోవచ్చు, వరుస సినిమాలతో హోరెత్తించేయొచ్చు. ఆ వేగమే రకుల్‌ని టాలీవుడ్‌లో నిన్న మొన్నటిదాకా బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా మార్చేసింది. ఒక్క ‘అయ్యారీ’ సినిమాతో రకుల్‌ కెరీర్‌ని కాస్త స్లో చేసేసింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular