HomeMovie News Teluguలండన్‌కి చెక్కేస్తోన్న రకుల్‌

లండన్‌కి చెక్కేస్తోన్న రకుల్‌

ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులోనూ, తమిళంలోనూ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. అలాగే అమ్మడికి హిందీ నుండీ ఆఫర్స్‌ వస్తున్నాయి. లేటెస్టుగా ఈ ముద్దుగుమ్మ నటించిన ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాతో సక్సెస్‌ అందుకుంది. ఈ సినిమా మొత్తానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌నే మెయిన్‌ అట్రాక్షన్‌. ఇది కాక రకుల్‌ చేతిలో ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు సినిమాలు, కోలీవుడ్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్‌లో కూడా అమ్మడు రెండు సినిమాలకి సైన్‌ చేసింది.

తమిళంలో యంగ్‌ హీరో నానితో జత కడుతోంది రకుల్‌. ఈ సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం బిజీగా ఉంది రకుల్‌. ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని త్వరలోనే మన స్మైలీ బ్యూటీ లండన్‌ వెళ్లిపోనుందట. అంటే ఏంటి మిగతా సినిమాల సంగతేంటి? అనుకుంటున్నారా? అదేనండీ, మహేష్‌తో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘స్పైడర్‌’ సినిమాలో నటిస్తోన్న సంగతీ తెలిసిందే. ఈ సినిమాలో రకుల్‌ ఆల్రెడీ తన పార్ట్‌ కంప్లీట్‌ చేసుకుంది. అయితే ఒక్క సాంగ్‌ బ్యాలెన్స్‌ ఉండిపోయిందట.

ఆ బ్యాలెన్స్‌ సాంగ్‌ చిత్రీకరణలో పాల్గొనేందుకే రకుల్‌ లండన్‌ వెళ్లనుందట. మురుగదాస్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘జయ జానకి నాయకా’ సినిమాలోనూ రకుల్‌ ప్రీత్‌ సింగే హీరోయిన్‌. బోయపాటి శీను డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆగష్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular