HomeMovie News Teluguవన్‌ అండ్‌ ఓన్లీ 'పవర్‌'స్టార్‌

వన్‌ అండ్‌ ఓన్లీ ‘పవర్‌’స్టార్‌

ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా పవన్‌కళ్యాణ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడట. ఓ సినిమా రిలీజ్‌కి ముందు 100 కోట్లు పైన బిజినెస్‌ చేయడం అనేది ఇంతవరకు కేవలం ‘బాహుబలి’ విషయంలోనే జరిగింది. ఆ తర్వాతి క్రెడిట్‌ పవన్‌కళ్యాణ్‌ – త్రివిక్రమ్‌ కాంబోలో రాబోతోన్న సినిమాదేనట. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ పరంగా ఈ సినిమాకి దక్కిన ఈ రికార్డు గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

పవన్‌ – త్రివిక్రమ్‌ కాంబోకి ఉన్న క్రేజ్‌ అలాంటిది. ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన ప్రతీ సినిమా హిట్టే ఇంతవరకూ. ఇంకో వైపున పవన్‌ నుంచి వరుసగా రెండు ఫ్లాప్‌లు వచ్చినా, అతని తదుపరి సినిమాపై అంచనాలు తగ్గకపోవడం ఆశ్చర్యకరం. అదే పవన్‌కళ్యాణ్‌లోని ‘పవర్‌’ అనుకోవచ్చు. పవన్‌ సరసన అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

పవన్‌ – త్రివిక్రమ్‌ కాంబోలో ఇంతకు ముందు ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలొచ్చాయి. ఈ రెండూ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. అదే కోవలో ఇప్పుడు రాబోతున్న సినిమాకి అంతకు మించిన క్రేజ్‌ ఏర్పడింది. సినిమాపై భారీ నుండి అతి భారీగా అంచనాలున్నాయి. ‘కాటమరాయుడు’ సినిమాతో నిరాశ పరిచిన పవన్‌ నుండి రాబోతున్న ఈ సినిమా బంపర్‌ హిట్‌ కావాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular