HomeMovie News Teluguసభ్య సమాజానికి: 'డీజె' వంద కోట్ల గ్రాస్‌

సభ్య సమాజానికి: ‘డీజె’ వంద కోట్ల గ్రాస్‌

‘డీజె’ దువ్వాడ జగన్నాధమ్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి నెగిటివ్‌ టాక్‌ వచ్చినా కానీ వసూళ్లలో మాత్రం విజయం సాధించింది. వందకోట్ల గ్రాస్‌ వసూళ్లని ‘డీజె’ సొంతం చేసుకుందని డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు. వారం రోజుల్లో ఇంత గ్రాస్‌ సాధించడం అంటే సక్సెస్‌ కాక ఇంకేమంంది. భారీ అంచనాల నడుమ విడుదలైంది ఈ సినిమా. వసూళ్లని బట్టి చూస్తే అనుకున్న అంచనాల్ని అందుకున్నట్లేనని భావించాలి.

‘బాహుబలి’ మేనియాలో ఉన్న ఆడియన్స్‌కి ‘డీజె’ డిఫరెంట్‌ ఫీల్‌ ఇచ్చిన సినిమా అయ్యింది. పూజా హెగ్దే ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జంటగా నటించింది. అమ్మడి హాట్‌ హాట్‌ అందాల ఆరబోత కుర్రకారుకు కిక్కెక్కించింది. పూజా, బన్నీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. అలరించే మ్యూజిక్‌, అదిరిపోయే యాక్షన్‌ అన్నీ కలిసి ఈ సినిమా బాక్సాఫీస్‌కి వసూళ్ల జాతర తెచ్చిపెట్టింది. బ్రాహ్మణ యువకుడిగా బన్నీ చేసిన ప్రయోగం విజయవంతమైనట్లే అని చెప్పొచ్చు.

అల్లు అర్జున్‌ తన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక రిజిస్టర్‌ డైలాగుతో ఆకట్టుకుంటాడు. అలాగే ఈ సినిమాలోని ‘సభ్య సమాజానికి’ అనే డైలాగు బాగా పాపులర్‌ అయ్యింది. చాలా క్యాచీగా జనాల్లోకి వెళ్లిపోయింది. తెలుగుతో పాటు, మలయాళంలోనూ ఈ సినిమా జోరుగా దూసుకెళ్తోంది. అక్కడ బన్నీకి ఉన్న ఫాలోయింగ్‌ అలాంటిది మరి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular