HomeMovie News Teluguకరణ్‌ జోహార్‌, ప్రభుదేవా - ప్రబాస్‌

కరణ్‌ జోహార్‌, ప్రభుదేవా – ప్రబాస్‌

మరో సెన్సేషనల్‌ ఫిలింకి రంగం సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కి, ఇండియన్‌ సినిమా సత్తాని దేశ దేశాల చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా వసూళ్ల వరద సృస్టించింది ఈ సినిమా. రికార్డుల మోత మోగించింది. హీరో ప్రబాస్‌ ఇప్పుడు ‘బాహుబలి’గా అంతటా పరిచయస్ధుడైపోయాడు. అందుకే పెరిగిన ఈ మార్కెట్‌తో ప్రభాస్‌ హీరోగా మరో భారీ బడ్జెట్‌ మూవీ సెట్స్‌ మీదకు వచ్చేలా ఉంది. తెలుగు, హిందీ భాషల్లో ఆ సినిమా రూపొందనుందని సమాచారమ్‌.

బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌, ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా సినిమా రూపొందించనున్నారట. అయితే ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన ఏదీ లేదు. కానీ ప్రభుదేవా మాత్రం, ప్రభాస్‌తో సినిమా చేయాలని ఉందని చెప్పాడు. ‘బాహుబలి’ సినిమాని హిందీలో విడుదల చేసిన కరణ్‌ జోహార్‌, ప్రభాస్‌తో ఓ సినిమా నిర్మించేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాడని సమాచారమ్‌. అంతే కాదు ప్రభుదేవాకి కూడా బాలీవుడ్‌లో హిట్‌ సినిమాల దర్శకుడిగా పాపులారిటీ ఉంది.

అందుకే ప్రబాస్‌ హీరోగా ఓ భారీ బడ్జెట్‌ మూవీని తెరకెక్కించాలన్న తన కోరికని బయట పెట్టాడు ప్రభుదేవా. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కింది. అదే ‘పౌర్ణమి’. అయితే ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది అప్పట్లో. కానీ ఈ సారి రాబోయే సినిమా మాత్రం ప్రభంజనం సృష్టించేలా ఉండబోతోందనీ, అందుకు పర్‌ఫెక్ట్‌ స్టోరీని ప్రిపేర్‌ చేసే పనిలో ప్రభుదేవా ఆల్రెడీ బిజీ అయిపోయారట కూడా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular