HomeMovie News Teluguహాలీవుడ్‌లో 'రోబో 2.0'ని ఎగరేశారు

హాలీవుడ్‌లో ‘రోబో 2.0’ని ఎగరేశారు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలకు పబ్లిసిటీ ఓ రేంజ్‌లో ఉంటుంది. సినిమా సక్సెస్‌ అయినా కాకపోయినా కానీ ఆ పబ్లిసిటీతో సినిమా అలా గుర్తుండిపోతుంది. అలాంటిది ది గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘రోబో 2.0’ సినిమా విషయంలో పబ్లిసిటీ ఇంకే రేంజ్‌లో ఉండబోతోందో ఊహించడమే కష్టం. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సందర్భంగా పబ్లిసిటీ షురూ చేసేశారు. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌తో ఏకంగా హాలీవుడ్‌లో ప్రచారం మొదలెట్టేశారు ‘రోబో 2.0’ సినిమా యూనిట్‌.

ఓ ఇండియన్‌ సినిమాకి సంబంధించి ఈ తరహా ప్రమోషన్‌ ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా హాలీవుడ్‌ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ‘రోబో 2.0’ సినిమాని రూపొందించారు. తమిళ సినిమా, ఇండియన్‌ సినిమా అనే హద్దుల్ని చెరిపేసి, హాలీవుడ్‌ సినిమాగా ‘రోబో 2.0’ని రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. అసలే శంకర్‌ సినిమాలకి ఉండే క్రేజే వేరు. దాన్ని క్యాష్‌ చేసుకునే ప్రయత్నంలో భాగంగా సినిమా ప్రమోషన్స్‌ని పీక్స్‌కి తీసుకెళతారట. సినిమా ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిపోయింది.

పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ముద్దుగుమ్మ అమీ జాక్సన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ విలనిజం ఈ సినిమాకి మరో హైలైట్‌ కానుంది. ఇప్పటికే అక్షయ్‌ కుమార్‌ ఫస్ట్‌లుక్‌తో విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. మొదటి పార్ట్‌ ‘రోబో’ని మించిన ఎక్స్‌పెక్టేషన్స్‌ ఈ సినిమాపై ఉన్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular