HomeMovie News Teluguతమన్నా ఔట్‌, లావణ్య ఇన్‌

తమన్నా ఔట్‌, లావణ్య ఇన్‌

‘100 పర్సంట్‌ లవ్‌’ సినిమాలో తమన్నా భాటియా తన మిల్కీ సొగసులతో ఆకట్టుకుంది. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. సింపుల్లీ సూపర్బ్‌ అన్పించే లవ్‌స్టోరీ ఇది. నాగచైతన్య కెరీర్‌లో తొలి కమర్షియల్‌ సూపర్‌ సక్సెస్‌ సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ సినిమాని తమిళంలోకి రీమేక్‌ చేస్తున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్‌కుమార్‌ హీరోగా మారి ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించాడు. ఈయనే తమిళంలో హీరోగా నటించనున్న ‘100 పర్సంట్‌ లవ్‌’ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు.

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠిని ఈ సినిమా కోసం హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ముందుగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నానే అనుకున్నప్పటికీ, చివరి నిమిషంలో ఆ ఛాన్స్‌ లావణ్య దక్కించుకున్నట్లు సమాచారమ్‌. జివి ప్రకాష్‌కుమార్‌ ఎవరో కాదు, సంగీత మాంత్రికుడు ఎ.ఆర్‌.రెహమాన్‌కి స్వయానా మేనల్లుడు. ‘డార్లింగ్‌’ తదితర తెలుగు సినిమాలకు సూపర్బ్‌ మ్యూజిక్‌ అందించాడు జివి ప్రకాష్‌కుమార్‌. తెలుగులో సూపర్‌ సక్సెస్‌ అందుకున్న ఈ సినిమా తమన్నాకి మంచి పేరు తీసుకొచ్చింది.

ఈ సినిమా తర్వాత తమన్నాకి తిరుగే లేకుండా పోయింది. అలాగే తమిళంలోనూ ఈ సినిమాపై అంచనాలున్నాయి. క్లాసిక్‌ మ్యూజిక్‌తో అక్కడ కూడా ఈ సినిమా విజయం సాధించే అవకాశాలు లేకపోలేవు. అదే కనుక జరిగితే కోలీవుడ్‌లో బ్యూటీ లావణ్యకి స్టార్‌ తిరిగినట్లే. తెలుగులోనూ లావణ్య బిజీగానే గడుపుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular