HomeMovie News Teluguపవన్‌కళ్యాణ్‌తో కష్టమే: రాజమౌళి

పవన్‌కళ్యాణ్‌తో కష్టమే: రాజమౌళి

ఫలానా హీరోతో సినిమా చేయాల్సి వస్తే? అన్న ప్రశ్న రాజమౌళి ముందుకు రావడం సహజమే. ఆ ప్రశ్న వేసింది భళ్ళాలదేవుడు రానా. ఓ టీవీ ప్రోగ్రామ్‌లో రాజమౌళిని, పవన్‌కళ్యాణ్‌తో సినిమా గురించి రానా అడిగితే, ఆసక్తికర సమాధానం చెప్పాడు. పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారని రాజమౌళి చెప్పారు. అంటే ఒక పక్క సినిమాలతోనూ, మరో పక్క రాజకీయాలతోనూ బిజీగా ఉన్నారనీ ఆయన ఉద్దేశ్యం.

ప్రస్తుతం పవన్‌ చేతిలో చాలానే సినిమాలున్నాయి. అదో ఎత్తు. ఇక ఆయన రాజకీయ రంగ ప్రవేశం మరో ఎత్తు. సో ఆయనతో సినిమా కుదరకపోవచ్చు అని అన్నాడు రాజమౌళి. అంతేకాదు ఒకవేళ పవన్‌కళ్యాణ్‌ ఒప్పుకుంటే సినిమా చేయడానికి సిద్ధమేనన్నట్లుగా రాజమౌళి సంకేతాలు పంపడం ఇక్కడ ప్రస్తావించదగ్గ అంశం. అయినా రాజమౌళితో సినిమా అంటే కొంచెం ఎక్కువే టైం తీసుకునే అవకాశాలున్నాయి. అందుకు పవన్‌కి టైమ్‌ లేదు. అయినా ఇప్పుడు రాజమౌళి సినిమా అంటే టాలీవుడ్‌ మాత్రమే కాదు బాలీవుడ్‌ నటీనటులు కూడా ఎగిరి గంతేస్తారు.

కానీ రాజమౌళి టాలీవుడ్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తాడు. ‘బాహుబలి’ సినిమా తర్వాత రాజమౌళి తదుపరి సినిమా ఏంటో మాత్రం ఎవరికీ తెలియడంలేదు. ఈ హీరోతో, ఆ హీరోతో అంటూ గెస్సింగ్స్‌ తప్ప క్లారిటీ లేదు. ఈ విషయంలో ఇంకా రాజమౌళి కూడా ఓ క్లారిటీకి రాలేదనే తెలుస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular